KKR vs SRH: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ ఆశలు నీరుగారిపోయాయి. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో కూడా రాణించలేకపోయింది. ఎస్ఆర్‌హెచ్‌పై కేకేఆర్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో అత్యంత కీలకమైన రెండు జట్లు డూ ఆర్ డై మ్యాచ్ ఇది. కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 177 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రస్సెల్ చివర్లో ధాటిగా ఆడటంతో కేకేఆర్ 177 పరుగుల చేయగలిగింది. రస్సెల్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా..సామ్ 34, రహానే 28 పరుగులు చేశారు. 16 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ స్కోరు కేవలం 125 పరుగులే. చివరి మూడు ఓవర్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారమయ్యాయి. 


178 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేకేఆర్ బౌలింగ్ ముందు పూర్తిగా తడబడింది. కెప్టెన్ విలియమ్సన్ మరోసారి విఫలమై రస్సెల్ బౌలింగ్‌లో 9 పరుగులకే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత 5 పరుగుల స్కోర్ వద్ద రాహుల్ త్రిపాఠీ రెండవ వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా బరిలో దిగిన అభిషేక్ శర్మ ఇవాళ్టి మ్యాచ్‌లో రాణించాడు. 43 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆ తరువాత బరిలో దిగిన పూరన్ ఎంతోసేపు నిలవలేకపోయాడు. సునీల్ నరైల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక ఆ తరువాత మార్క్‌క్రమ్ కాస్త ధాటిగా ఆడుతూ 35 పరుగుల స్కోర్ వద్ద అవుటయ్యాడు. 18 ఓవర్లు ముగిసేసరికి..8 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేయగలిగింది. వికెట్ల పతనం కొనసాగుతూ..చివరికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. 


Also read: Ambati Rayudu: అంబటి రాయుడు రిటైర్మెంట్‌ ట్వీట్‌పై స్పందించిన చెన్నై.. సైకలాజికల్ డిస్టర్బెన్స్ అంటూ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.