Rashid khan: ఆఫ్ఘన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అరుదైన రికార్డు, మరెవరికీ సాధ్యం కాని రికార్డు
Rashid khan: ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రషీద్ ఖాన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. టీ20 ఫార్మట్ క్రికెట్‌లో అతి వేగంగా వికెట్లు తీసిన యంగ్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆ రికార్డు వివరాలేంటో పరిశీలిద్దాం.
Rashid khan: ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రషీద్ ఖాన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. టీ20 ఫార్మట్ క్రికెట్‌లో అతి వేగంగా వికెట్లు తీసిన యంగ్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆ రికార్డు వివరాలేంటో పరిశీలిద్దాం.
మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్(Rashid Khan)అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్టిన్ గుప్టిల్‌ను ఔట్ చేయడం ద్వారా రషీద్ ఖాన్ అరుదైన రికార్డు సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) స్టార్ స్పిన్నర్‌గా, ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) మేటి ఆటగాడిగా పేరు సంపాదించుకున్న రషీద్ ఖాన్ అందరికీ సుపరిచితుడు. ముఖ్యంగా హైదరాబాద్ టీమ్‌కు ఎక్కువకాలం ఆడటం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. కాస్తో కూస్తో తెలుగు మాట్లాడగలడు కూడా. టీ20 ఫార్మాట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 4 వందల వికెట్లు తీసిన యంగెస్ట్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మరో ప్రత్యేకత ఏంటంటే..కేవలం 23 ఏళ్ల రషీద్ ఖాన్ టీ20లో ఆరంగేట్రం చేసిన తరువాత ఏ ఒక్క బౌలర్ కూడా ఈ అరుదైన రికార్డు సాధించలేకపోయాడు. రషీద్ ఖాన్ ఆరేళ్ల వ్యవధిలో 289 మ్యాచ్‌లు ఆడి ఈ మైలురాయిని చేరుకున్నాడు. రషీద్ ఖాన్ కంటే ముందు టీ20 400 వికెట్ల క్లబ్‌లో(Rashid khan in 4 hundred wickets club) 553 వికెట్లతో డ్వేన్ బ్రావో, 420 వికెట్లతో ఇమ్రాన్ తాహిర్, 425 వికెట్లతో సునీల్ నరైన్ ఉన్నారు.
నిన్న జరిగిన టీ20 ప్రపంచకప్ 2021(T20 World Cup 2021) న్యూజిలాండ్(Newzealand)వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆఫ్ఘనిస్తాన్ పరాజయంతో టీమ్ ఇండియా సెమీస్ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి. నవంబర్ 10, 11 తేదీల్లో జరగనున్న రెండు సెమీఫైనల్స్ మ్యాచ్‌లలో పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి.
Also read: Virat Kohli: టీమ్ ఇండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ప్రయాణం విజయవంతమా, విఫలమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook