టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్స్ పోరులో ఎవరనేది రోజురోజుకూ ఆసక్తి కల్గిస్తోంది. రేపు అంటే నవంబర్ 6న జరగనున్న ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ ఫలితం సెమీఫైనల్స్ బెర్త్‌లపై ప్రభావం చూపించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవంబర్ 6న జరగనున్న ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్‌పై అందరి దృష్టి నెలకొంది. టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్స్ బెర్త్ నిర్ధారణకు ఈ మ్యాచ్ చాలా కీలకం. టీమ్ ఇండియా సెమీఫైనల్స్ ఆశల్ని నిర్ధారించేది ఈ మ్యాచ్‌నే. జింబాబ్వేపై ఇండియా విజయం సాధిస్తేనే సెమీఫైనల్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. అదే సమయంలో పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా కీలకంగా మారుతుంది. పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ విజయం సాధిస్తే..జింబాబ్వే మ్యాచ్‌లో ఇండియాపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అదే పాకిస్తాన్ గెలిస్తే మాత్రం..ఇండియా తప్పకుండా గెలవాల్సిందే. గ్రూప్ 2 నుంచి ఇప్పటివరకూ జింబాబ్వే, నెదర్లాండ్స్ సెమీఫైనల్స్ బెర్త్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి.


జింబాబ్వే మ్యాచ్‌పై వర్షం ప్రభావం


ఇండియా, జింబాబ్వే మ్యాచ్‌పై వర్షం ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు. ఆస్ట్రేలియా వాతావరణ శాఖ సూచనల ప్రకారం నవంబర్ 6 వతేదీన మెల్‌బోర్న్ వాతావరణం అంచనాలు ఇలా ఉన్నాయి. పాక్షికంగా మేఘాలు ఆవృతమయ్యే అవకాశాలున్నాయి. వర్షం పడే సూచనలు జీరో అని చెబుతున్నా..తీసిపారేయలేమంటోంది. ఇప్పటివరకూ ఇండియా మ్యాచ్‌లపై వర్షం ప్రభావం పడలేదు. బంగ్లేదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్ ఇండియాకు చివరి మ్యాచ్. 


మ్యాచ్ వర్షంతో రద్దయితే..ఇండియా సెమీఫైనల్ ఆశలు ఎలా ఉంటాయి


రేపు అంటే నవంబర్ 6 వతేదీ ఆదివారం నాడు వర్షం పడి..మ్యాచ్ రద్దయితే ఇండియా సెమీఫైనల్స్ ఆశలపై ప్రభావం పెద్దగా పడదనే చెప్పాలి. ఇంకా ఇండియాకు సెమీఫైనల్స్ ఆశలుంటాయి. ఎందుకంటే పాకిస్తాన్..బంగ్లేదేశ్‌ను ఓడించినా ఆ జట్టుకు ఆరు పాయింట్లు ఉంటాయి. ఇండియా ఇప్పటికే ఆరు పాయింట్లు సాధించింది. మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే చెరో పాయింట్ చొప్పున ఇండియాకు 1 పాయింట్ లభిస్తుంది. 


Also read: England Vs Sri Lanka: టీ20 వరల్డ్‌కప్ నుంచి ఆసీస్‌ ఔట్.. లంకేయులు చిత్తు.. ఇంగ్లాండ్ సెమీస్‌కు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook