England Vs Sri Lanka: టీ20 వరల్డ్‌కప్ నుంచి ఆసీస్‌ ఔట్.. లంకేయులు చిత్తు.. ఇంగ్లాండ్ సెమీస్‌కు..!

England beat Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా ఇంటికి ముఖం పట్టింది. గ్రూప్-ఎ నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్‌లో అడుగుపెట్టాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2022, 05:15 PM IST
England Vs Sri Lanka: టీ20 వరల్డ్‌కప్ నుంచి ఆసీస్‌ ఔట్.. లంకేయులు చిత్తు.. ఇంగ్లాండ్ సెమీస్‌కు..!

England beat Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అదరగొట్టింది. శ్రీలంకను ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇంగ్లాండ్ విజయంతో అతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఇంటి ముఖం పట్టింది. ఇంగ్లీష్‌ టీమ్‌ను శ్రీలకం ఓడిస్తుందని ఎన్నో ఆశలు పెట్టకున్న కంగారులకు చివరికి నిరాశ తప్పలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన లంకేయులు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 

టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకను ఇంగ్లాండ్ బౌలర్లు ఆది నుంచే భయపెట్టారు. లంక బ్యాట్స్‌మెన్స్‌లో ఓపెనర్ నిస్సంక (67) తప్పా.. మిగిలిన వారందరూ విఫలమయ్యారు. మొదట 3.5 ఓవర్లలోనే 39 పరుగులు జోడించి దూకుడు మీద కనిపించి శ్రీలంక.. ఆ తరువాత వరుసగా వికెట్లు కోల్పోయింది. నిస్సంక ఓ ఎండ్‌లో ఒంటరి పోరాటం చేయగా.. మరో ఎండ్‌లో సహరించేవారు కరువయ్యారు. రాజపక్స (22) ఫర్వాదలేనిపించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. చివరికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 రన్స్‌ మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. స్టోక్స్, క్రిస్ వోక్స్, శామ్ కర్రన్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు.

అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్ల జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ గట్టి పునాది వేశారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 7.1 ఓవర్లలోనే 75 పరుగులు జోడించారు. బట్లర్ (28), హేల్స్ (47) ఔట్ అయిన తరువాత ఇంగ్లాండ్ కాస్త కష్టాల్లో పడింది. బ్రూక్, లివింగ్ స్టోన్, మెయిన్ అలీ, శ్యామ్ కర్రన్ వరుసగా డగౌట్‌కు క్యూ కట్టారు. మరో ఎండ్‌లో పాతుకుపోయిన బెన్ స్టోక్స్ (44) చివరి వరకు క్రీజ్‌లో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమారా, హసరంగా, ధనుంజయ డిసిల్వా చెరో వికెట్లు తీశారు. గ్రూప్-ఎ నుంచి న్యూజిలాండ్‌తో పాటు ఇంగ్లాండ్‌ సెమీస్‌కు చేరింది. కంగారుల జట్టు ఇంటి ముఖం పట్టింది.

Also Read: T20 World Cup: సెమీస్‌కు ఒక్క అడుగు దూరంలో.. ఈ ప్లేయర్‌కు మళ్లీ అవకాశం ఇస్తారా..?  

Also Read: Virat Kohli Birthday Special: వెరైటీ ఫొటోలు షేర్ చేసిన అనుష్క శర్మ.. చూస్తే నవ్వు ఆపుకోలేరు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News