Shoaib Akhtar on IND vs PAK Match: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా టీ20 ప్రపంచకప్ 2022 (T20 World Cup 2022) షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 16 నుంచి తొలి రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా.. అక్టోబరు 22న సూపర్-12 స్టేజ్ మ్యాచులు ఆరంభమవుతాయి. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌తో ఆతిథ్య ఆస్ట్రేలియా తలపడనుంది. ఇక భారత జట్టు (Team India) తన తొలి మ్యాచ్ అక్టోబరు 23న ఆడుతుంది. ఈసారి కూడా ఈ మెగా టోర్నీలో భారత్ తలపడే తొలి ప్రత్యర్థి దాయాది పాకిస్తానే (Pakistan) కావడం గమనార్హం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్ 2022కు ఇంకా 8 నెలల సమయం ఉన్నా.. మెగా టోర్నీపై అప్పుడే చర్చ మొదలైంది. మాజీలు భారత్-పాకిస్తాన్ (IND vs PAK) మాచుపై తమతమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) మాట్లాడుతూ... 'మెల్‌బోర్న్‌లో భారత్‌ను మేము మళ్లీ ఓడిస్తాం. టీ20 క్రికెట్‌లో భారత్‌ కంటే పాకిస్థాన్‌ మెరుగైన జట్టు. క్రికెట్‌లో టీమిండియా, పాక్ జట్లు తలపడే సందర్భాల్లో భారత్ మీడియా తమ సొంత జట్టుపై అనవసర ఒత్తిడి పెంచుతోంది. ఓడిపోవడం టీమిండియాకు సాధారణమే' అని అన్నాడు. అక్తర్ సంచలన వ్యాఖ్యలపై ఇండియన్ ఫాన్స్ మండిపడుతున్నారు. 


Also Read: IND vs SA 3rd ODI: ఓపెనర్‌గా గబ్బర్ వద్దు.. వెంకటేశ్‌ ముద్దు! భువీ స్థానంలో అతడే బెటర్!!


భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీపై కూడా షోయబ్ అక్తర్ స్పందించాడు. కోహ్లీని జట్టు సారథిగా తప్పుకునేలా చేశారని అక్తర్ వ్యాఖ్యానించాడు. 'విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్సీని తనకు తానుగా విడిచిపెట్టలేదు. అలా చేసేలా కొంతమంది వ్యవహరాలు నడిపారు. క్రికెట్ ఆటలో స్టార్ స్టేటస్ ఉన్నవారికి ఇవన్నీ మామూలే. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేనికీ బెదరకుండా ఆటను ఆస్వాదించాలి' అని అక్తర్ సూచించాడు.


'విరాట్ కోహ్లీకి ప్రస్తుతం కాలం కలసి రావడం లేదు. అయితే ఏ ప్రతిభతో పైకి వచ్చాడో దాన్నే మరోసారి నిరూపించుకోవాలి. విరాట్  మంచి వ్యక్తి, అంతకుమించి గొప్ప క్రికెటర్. కోహ్లీ ప్రపంచంలో ఇతర క్రికెటర్ల కంటే ఎక్కువే సాధించాడు. అతడు ఆటపైనే దృష్టి పెట్టాలి. వేటినీ పట్టించుకోకూడదు. రానున్న ఆరు నెలల్లో మంచి ప్రదర్శన చేస్తే.. కెప్టెన్సీని వదులుకున్నందుకు ప్రతిఫలం దక్కినట్టే' అని విరాట్ కోహ్లీకి షోయబ్ అక్తర్ మద్దతుగా నిలిచాడు. 


Also Read: Nidhhi Agerwal Photoshoot: నిధి అగర్వాల్ ఫోటో షూట్.. చూపు తిప్పుకోనివ్వని అందం! పావురాల మందలో రాజహంస!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook