IND vs SA 3rd ODI: ఓపెనర్‌గా గబ్బర్ వద్దు.. వెంకటేశ్‌ ముద్దు! భువీ స్థానంలో అతడే బెటర్!!

Sanjay Manjrekar about India Playing XI. దక్షిణాఫ్రికాతో జరిగే మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ను తీసుకోవాలని సంజయ్‌ మంజ్రేకర్‌ సూచించాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2022, 12:34 PM IST
  • ఓపెనర్‌గా గబ్బర్ వద్దు.. వెంకటేశ్‌ ముద్దు
  • భువీ స్థానంలో అతడే బెటర్
  • భారత్ ఓ సువర్ణావకాశాన్ని కోల్పోయింది
IND vs SA 3rd ODI: ఓపెనర్‌గా గబ్బర్ వద్దు.. వెంకటేశ్‌ ముద్దు! భువీ స్థానంలో అతడే బెటర్!!

Sanjay Manjrekar about India Playing XI: టెస్టు సిరీస్‌లో పరాజయం అనంతరం వన్డేల్లోనూ వరుసగా రెండు ఓటములతో ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన టీమిండియా.. ఈరోజు నామమాత్రమైన చివరి వన్డే (IND vs SA 3rd ODI)లో సఫారీ జట్టుతో తలపడబోతోంది. సిరీస్‌ పోయినా మూడో వన్డే మ్యాచ్‌లో గెలిచి వైట్‌వాష్‌ తప్పించుకోవడమే కాకుండా పరువు దక్కించుకోవాలని భారత్‌ చూస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా (Team India) భారీ మార్పులతో బరిలోకి దిగితే తప్ప విజయం సాధించేలా లేదు. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ (Sanjay Manjrekar) పేర్కొన్నాడు. భారత్‌ భారీ మార్పులతో బరిలోకి దిగితేనే ఫలితం ఉంటుందన్నాడు.

స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ను తుది జట్టు (India Playing XI)లోకి తీసుకోవాలని సంజయ్‌ మంజ్రేకర్‌ సూచించాడు. భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా మరికొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. తాజాగా ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మంజ్రేకర్‌ మాట్లాడుతూ...'శిఖర్‌ ధావన్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడు రెడీమేడ్‌ ఆప్షన్‌. పెద్ద మ్యాచ్‌లకు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ధావన్‌కు విశ్రాంతినిచ్చి వెంకటేశ్‌ అయ్యర్‌ (Venkatesh Iyer)ను ఓపెనర్‌గా ఆడించాలి. దాంతో మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav)ను ఆడించొచ్చు. ఇది మంచి ఎంపిక' అని అన్నాడు. 

Also Read: Nidhhi Agerwal Photoshoot: నిధి అగర్వాల్ ఫోటో షూట్.. చూపు తిప్పుకోనివ్వని అందం! పావురాల మందలో రాజహంస!!

'ఇక బౌలర్ల విషయానికొస్తే.. సీనియర్ పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ స్థానంలో యువ బౌలర్ దీపక్‌ చహర్‌ (Deepak Chahar)ను తుది జట్టులోకి తీసుకోవాలి. శ్రీలంకలో అతడి బౌలింగ్‌ను చూశాం. మెరుగైన ప్రదర్శన చేశాడు. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనుకుంటే.. మొహ్మద్ సిరాజ్‌ లేదా ప్రసిద్‌ కృష్ణను ఎంపిక చేసుకోవాలి. స్పిన్నర్ ఆర్ అశ్విన్‌ను పక్కనపెట్టి జయంత్‌ యాదవ్‌ను తీసుకోవాలి. అతడు 10 ఓవర్లు బౌలింగ్ చేయగలడు. యాష్ బాగా బౌలింగ్ చేసినా.. జయంత్‌ బ్యాటింగ్‌ చేయడం కలిసొస్తుంది' అని సంజయ్‌ మంజ్రేకర్‌ సూచించాడు. 

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో యువకులను ఉపయోగించుకోకపోవడం వల్ల భారత్ ఓ సువర్ణావకాశాన్ని కోల్పోయిందని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. 'యువకులు ప్రతిభను పరీక్షించడానికి ఈ సిరీస్‌ను ఉపయోగించకుండా భారత్ ఒక సువర్ణావకాశాన్ని కోల్పోయిందని నేను భావిస్తున్నాను. ఈ వన్డే సిరీస్‌లో వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్లు లెక్కించబడవు. కాబట్టి మొదటి మ్యాచ్ యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. కానీ భారత్ అలా చేయకపోయినా ఓడిపోయింది. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయింది కాబట్టి చివరి వన్డేలో అయినా కొత్తవారికి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఒకరు లేదా ఇద్దరు మంచి ఇన్నింగ్స్ ఆడినా అది భారత క్రికెట్‌కు మేలు చేస్తుంది' అని మంజ్రేకర్‌ వివరించాడు. 

Also Read: Harbhajan Singh - Virat Kohli: ఇక ఆడకుంటే అంతేసంగతులు.. విరాట్ కోహ్లీకి డైరెక్టుగానే వార్నింగ్ ఇచ్చిన మాజీ క్రికెటర్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News