Nidhhi Agerwal Photoshoot: నిధి అగర్వాల్ ఫోటో షూట్.. చూపు తిప్పుకోనివ్వని అందం! పావురాల మందలో రాజహంస!!

Nidhhi Agerwal Photoshoot: తాజాగా అందాల భామ నిధి అగర్వాల్ ఓ ఫోటోషూట్ చేశారు. తెల్లటి లాంగ్ ఫ్రాక్‌లో కనువిందు చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2022, 04:57 PM IST
  • నిధి అగర్వాల్ ఫోటో షూట్
  • చూపు తిప్పుకోనివ్వని అందం
  • పావురాల మందలో రాజహంస
Nidhhi Agerwal Photoshoot: నిధి అగర్వాల్ ఫోటో షూట్.. చూపు తిప్పుకోనివ్వని అందం! పావురాల మందలో రాజహంస!!

Nidhhi Agerwal Latest Photoshoot Pictures: నాగ చైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమాతో అందాల భామ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. సవ్యసాచి సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా నిధి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తన అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకున్నారు. అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' సినిమాలో నటించి పర్లేదు అనిపించుకున్నారు. ఇక ఎనర్జటిక్ హీరో రామ్ హీరో నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా నిధి క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. ఈ సినిమాలో నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ అలరించారు. 

నిధి అగ‌ర్వాల్‌ ఇటీవలి కాలంలో తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా.. తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు జయం రవి, శింబు సరసన నటించారు. తాజాగా తెలుగులో 'సూపర్ స్టార్' మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన 'హీరో' సినిమాలోనూ నిధి హీరోయిన్‌గా నటించారు. సంక్రాంతికి విడుదల అయిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్‌ అందాల ప్రదర్శన చేశారు.

Also Read: Mahesh Babu: సోదరుడు రమేష్ బాబు పెద్దకర్మకు మహేష్.. కన్నీటిపర్యంతమైన సూపర్ స్టార్.. 

తమిళనాట ప్రస్తుతం హాట్ హీరోయిన్ అయిపోయారు నిధి అగ‌ర్వాల్‌. సినిమాలతో బిజీబిజీగా ఉన్నా.. మధ్యలో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ పిచ్చెక్కిస్తున్నారు నిధి. తాజాగా నిధి ఓ ఫోటోషూట్ (Nidhhi Agerwal Latest Photoshoot Pictures) చేశారు. తెల్లటి లాంగ్ ఫ్రాక్‌లో కనువిందు చేశారు. నిధి అందాలు చూపు తిప్పుకోనివ్వకుండా ఉన్నాయి. తన పోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి 'పావురాల మందలో రాజహంస' అనే కాప్షన్ ఇచ్చారు. ఈ  ఫొటోలకు లైకుల వర్షం కురుస్తోంది. 

'హీరో' సినిమాకు నిధి అగ‌ర్వాల్‌ భారీగా రెమ్యునరేషన్‌ (Nidhhi Agerwal Remuneration ) అందుకుందని సమాచారం తెలుస్తుంది. అందాల నిధి ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు 50 లక్షల నుంచి 80 లక్షల మద్య పారితోషికం అందుకునేది. కాని హీరో సినిమాలో అశోక్ గల్లాకు జోడీగా నటించేందుకు ఈ అమ్మడు ఏకంగా కోటిన్నర అందుకున్నట్లుగా ఫిల్మ్ నగర్ టాక్.

Also Read: Harbhajan Singh - Virat Kohli: ఇక ఆడకుంటే అంతేసంగతులు.. విరాట్ కోహ్లీకి డైరెక్టుగానే వార్నింగ్ ఇచ్చిన మాజీ క్రికెటర్!!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరి హర వీర మల్లు' సినిమాలో నిధి అగ‌ర్వాల్‌ నటిస్తున్నారు. మరో వైపు బాలీవుడ్ నుంచి కూడా సినిమాలు లైన్‌లో పెట్టాలని చూస్తున్నారట. ఇక కోలీవుడ్‌ స్టార్‌ హీరో శింబు (Simbu)తో నిధి అగర్వాల్‌ సహజీవనం (Nidhhi Agerwal In A Live-In Relationship) చేస్తున్నారని అక్కడి మీడియా కోడై కూస్తోంది. చెన్నైలో ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారని రూమర్స్ వస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News