Virat Kohli: ఆసియా కప్ ప్రారంభమయ్యేందుకు మరి కొద్దిగంటలు మిగిలుంది. టీమ్ ఇండియా మాజీ రధ సారధి, కీలక ఆటగాడైన విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. కోహ్లీ రిటైర్ కానున్నాడనే సంకేతాలు వెలువడుతున్నాయి. అసలేం జరిగిందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్ 2022 లో ప్రత్యర్ధి దేశం పాకిస్తాన్‌పై ఆగస్టు 28వ తేదీ ఆదివారం మరో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధమౌతున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ చేసిన ఒక ట్వీట్ క్రికెట్ ప్రేమికుల్ని ముఖ్యంగా కోహ్లీ అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. 


విరాట్ కోహ్లీ..తాను మహేంద్ర ధోనీతో ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ 7 ప్లస్ 18..నా కెరీర్‌లో నేను ఆస్వాదించిన అద్భుతమైన క్షణాలు ఏమైనా ఉన్నాయంటే..ధోనీకి నమ్మదగిన డిప్యూటీగా ఉండటమే అని రాసుకొచ్చాడు. ఇందులో 7 ప్లస్ 18 ఏంటనుకుంటున్నారా..7 అనేది ధోని జెర్సీ నెంబర్ అయితే 18 విరాట్ కోహ్లి జెర్సీ నెంబర్. విరాట్ కోహ్లీ దోనిని గుర్తు చేసుకుంటూ ఇలా ట్వీట్ చేయడంతో ..రిటైర్మెంట్ ఆలోచన ఉందా అనే ఆందోళన పెరిగింది అభిమానుల్లో. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 


మహేంద్ర సింగ్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి సన్యాసం తీసుకున్నాడు. ధోనీ సారధ్యంలో 2008లో టీమ్ ఇండియాలో ప్రవేశించిన విరాట్ కోహ్లి..చాలా కాలం ధోనీ కింద వైస్ కెప్టెన్ బాధ్యతలు నెరవేర్చాడు. 2014లో టెస్ట్ క్రికెట్, 2017లో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పదవుల్నించి వైదొలగిన తరువాత విరాట్ కోహ్లి టీమ్ ఇండియా సారధిగా బాధ్యతలు స్వీకరించాడు. 


కోహ్లి నేతృత్వంలో టీమ్ ఇండియా భారీ విజయాలు నమోదు చేసింది. ప్రత్యేకించి టెస్ట్ ఫార్మెట్‌లో కోహ్లీ..టీమ్ ఇండియాను ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్‌లో అగ్రస్థానంలో నిలబెట్టాడు. దాంతోపాటు ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ గెల్చుకున్నాడు. క్రికెట్ ప్రపంచంలో ఇంతగా ప్రాచుర్యం పొందినా..ధోనీ నేతృత్వంలో సాగిన రోజుల్నే కెరీర్‌లో అద్భుత క్షణాలుగా భావిస్తూ..ఆవేదనకు లోనయ్యాడు. 


33 ఏళ్ల విరాట్ కోహ్లి..ఆగస్టు 25న ఈ ట్వీట్ చేశాడు. ధోనీతో గడిపిన క్షణాల్ని, రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. తన అధికారి ట్విట్టర్ ఎక్కౌంట్‌లో ధోనితో గ్రౌండ్‌లో ఉన్న ఫోటో షేర్ చేశాడు. ఈ మనిషికి డిప్యూటీగా వ్యవహరించడం నా కెరీర్‌లో అత్యంత అద్భుత క్షణాలని ట్వీట్ చేశాడు. మా ఇద్దరి భాగస్వామ్యం ఎప్పటికీ నాకు ప్రత్యేకం అని రాసుకొచ్చాడు.


ఇంకా కెరీర్ కొనసాగుతున్నా..ఆసియా కప్‌కు ఆడుతున్నా సరే తన కెరీర్‌లో అవే అద్భుత క్షణాలని వ్యాఖ్యానించడం వెనుక కారణాలేంటనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. విరాట్ కోహ్లీ రిటైర్ కానున్నాడా అనే ఆందోళన ఫ్యాన్స్‌లో పెరిగిపోయింది. 


Also read: Asia Cup 2022: టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లో ఆ కీలక ఆటగాడికి స్థానం లేదా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook