Asia Cup 2022: క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కపా్ 2022 మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఆసియా కప్‌లో ఆడాలని ఎదురుచూస్తున్న ఆ ఆటగాడికి టీమ్ ఇండియాలో స్థానం దక్కడం అనుమానంగానే ఉంది.
ఆసియా కప్ 2022 కోసం టీమ్ ఇండియా భారీగా కసరత్తు చేస్తోంది. ఈ భారీ టోర్నమెంట్ కోసం పటిష్టమైన జట్టును రంగంలో దింపుతోంది బీసీసీఐ. రోహిత్ శర్మ సారధ్యంలోని ఈ జట్టులో కొంతమంది యువ క్రీడాకారులకు అవకాశం దక్కింది. విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్లు కూడా చోటు సంపాదించుకున్నారు. కానీ ఇదే జట్టులో ఓ ఆటగాడికి మాత్రం ప్లేయింగ్ 11లో అవకాశాలు దక్కడం కష్టంగా మారింది.
ఆసియా కప్ కోసం టీమ్ ఇండియా తొలి మ్యాచ్ ఆగస్టు 28వ తేదీన ప్రత్యర్ధి దేశం పాకిస్తాన్‌తో తలపడనుంది. అటు పాకిస్తాన్‌కు కూడా ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. అందుకే అందరి దృష్టీ ఈ మ్యాచ్‌పై పడింది. టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 ఎవరనేది ఆసక్తిగా మారింది. జట్టులో ఉన్న యువ స్పిన్నర్ రవి బిశ్నోయి పరిస్థితి సందేహంగా మారింది. ప్లేయింగ్ 11లో ఇతడికి అవకాశం దక్కడం దాదాపుగా లేదనే చెప్పాలి. ఆసియా కప్ 2022 టీమ్ ఇండియా ప్లేయింగ్ 15కు ఎంపికైనా..ప్లేయింగ్ 11లో ఉండే పరిస్థితి లేదనే చెప్పాలి
ఆసియా కప్ 2022 కోసం టీమ్ ఇండియా జట్టులో రవి బిశ్నోయి కాకుండా రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్ ఇప్పటికే ఉన్నారు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నాడు. ఈ ముగ్గురి కారణంగా రవి బిశ్నోయి మొత్తం టోర్నీలో ప్లేయింగ్ 11లో అవకాశం దక్కించుకోవడం కష్టంగానే ఉంది. వాస్తవానికి రవి బిశ్నోయి ఇటీవలి కాలంలో మంచి ప్రదర్శన చూపించినా..ప్లేయింగ్ 11లో మాత్రం చోటు దక్కేలా లేదు. రవి బిశ్నోయి టీమ్ ఇండియా కోసం 9 టీ20 మ్యాచ్ లు ఆడాడు. 9 మ్యాచ్‌లలో 7.15 శాతం సగటున 15 వికెట్లు సాధించినా ప్రయోజనం లేకపోయింది.
ఆసియా కప్ టీమ్ ఇండియా జట్టు
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, హార్డిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిశ్నోయి భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింహ్, ఆవేశ్ ఖాన్
Also read: Deepak Chahar BCCI: ఆ వార్తల్లో నిజం లేదు.. దీపక్ చహర్ జట్టుతోనే ఉన్నాడు: బీసీసీఐ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook