VR Vanitha Retirement: టీమిండియా మహిళా క్రికెటర్ వీఆర్ వనిత రిటైర్‌మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు మంగళవారం (ఫిబ్రవరి 21) వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆమె ట్వీట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'19 ఏళ్ల క్రితం నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పుడు నేను చాలా చిన్నదాన్ని. అప్పటికీ ఇప్పటికీ క్రికెట్‌పై నా ప్రేమ అలాగే ఉంది. మారుతున్నది కేవలం డైరెక్షన్ మాత్రమే. నా మనసు క్రికెట్‌ను కొనసాగించమని చెబుతోంది.. కానీ నా శరీరం ఇక ఆపమంటోంది. అందుకే క్రికెట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నా. ఇది ఎంతో స్ట్రగుల్, జాయ్, హార్ట్ బ్రేకింగ్‌తో కూడి జర్నీ. ఎంతో నేర్చుకున్నాను. ఎన్నో మైలురాళ్లను చేరుకున్నాను.' అని వనిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


కొన్ని రిగ్రెట్స్ ఉన్నప్పటికీ తనకు వచ్చిన అవకాశాలకు, టీమిండియాకు ప్రాతినిధ్యం వహించినందుకు తాను కృతజ్ఞురాలిని అని వీఆర్ వనిత పేర్కొన్నారు. తాను నడిచొచ్చిన దారిలో  ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానని తెలిపారు. ఇక ఇప్పటినుంచి క్రికెట్‌లో యంగ్ టాలెంట్‌ను తీర్చిదిద్దడం పైనే తన ఫోకస్ ఉంటుందన్నారు.


వీఆర్ వనిత 2014లో శ్రీలంకతో వన్డేతో టీమిండియా తరుపున ఆరంగేట్రం చేశారు. ఇప్పటివరకూ టీమిండియా తరుపున ఆరు వన్డేలు, 16 టీ20లు ఆడారు. వన్డేల్లో 17 సగటుతో 85 పరుగులు, టీ20ల్లో 14.40 సగటుతో 216 పరుగులు చేశారు. దేశవాళీ క్రికెట్‌లో ఆమె కర్ణాటక తరుపున పలు మ్యాచ్‌లలో ఆడారు.



Also Read: Bheemla Nayak Trailer: భీమ్లా నాయక్ ట్రైలర్.. పవర్ ప్యాక్డ్... ఫ్యాన్స్‌కు పూనకాలే..


Bheemla Nayak: ట్రైలర్ గంట ఆలస్యం... భీమ్లా నాయక్ టీమ్ ను ఏకిపారేసిన ఫ్యాన్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook