BCCI new Guidelines: సాహా వివాదంతో బీసీసీఐలో కదలిక- కొత్త నిబంధనల దిశగా అడుగులు!

BCCI new Guidelines: మీడియాకు, ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త నిబంధనలను అమలు చేయనున్నట్లు సమాచారం. సాహా వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2022, 07:41 PM IST
  • సాహా వివాదంతో బీసీసీఐ కీలక నిర్ణయం!
  • త్వరలో మీడియాకు కొత్త నిబంధనలు!
  • ఆటగాళ్లపై కూడా కొత్త నిబంధనల ప్రభావం!
BCCI new Guidelines: సాహా వివాదంతో బీసీసీఐలో కదలిక- కొత్త నిబంధనల దిశగా అడుగులు!

BCCI new Guidelines: టీమ్​ ఇండియా వికెట్​ కీపర్, సీనియర్ ఆటగాడు వృద్ధిమాన్​ సాహా వివాదంతో బీసీసీఐ కఠిన నిబంధనల దిశగా అకడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు మీడియాతో మాట్లాడటం, జర్నలిస్టులు ప్లేయర్స్​ను సంప్రదించే విషయమై కొత్త రూల్స్ అమలు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

కొత్త రూల్స్​ ఏమిటంటే..

ఇకపై బీసీసీఐ కాంట్రాక్టు ప్లేయర్స్ (అండర్​ 19 ఆటగాళ్లు కూడా)  నేరుగా మీడియాతో మాట్లాడేందుకు వీలులేదు. బీసీసీఐ అధికారిక మేనేజర్​ ద్వారా మాత్రమే మీడియాను సంప్రదించాలి.

మీడియాతో మాట్లాడే విషయంలో ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. అలాంటి వ్యాఖ్యలు చేస్తే గనక జరిమానా విధించడం లేదా తాత్కాలిక నిషేధం వంటి పర్యావాసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వ్యక్తిగత జీవితంలో, ఇతర విషయాలపై మాత్రం మీడియాతో మాట్లాడే విషయంలో ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

మీడియాకు కొత్త రూల్స్​ ఇలా..

ఆటగాళ్లతో పాటు.. మీడియాకు కూడా కత్త నిబంధనలను పెట్టనుందట బీసీసీఐ.

బీసీసీఐ అనుమతి లేకుండా ఆటగాళ్లతో బైట్స్​ తీసుకోవడం, ఇంటర్వ్యూలు చేయడం వంటివి చేస్తే.. ఆటగాళ్లతో పాటు ఆ జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోందట.

అంటే అనుమతి లేకుండా బైట్లు, ఇంటర్వ్యూలు తీసుకున్న జర్నలిస్టులను బ్లాక్​ లిస్ట్​లో పెట్టడం వంటివి చేయనున్నట్లు సమాచారం.

ఈ విషయాలన్నింటిపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇంతకీ సహాకు వచ్చిన సమస్య ఏమిటి?

వృద్ధిమాన్ సాహాను ఇంటర్వ్యూ ఇవ్వాలని ఓ జర్నలిస్ట్.. వాట్సాప్ ద్వారా సంప్రదించాడు. అయితే ఆ మెసేజ్​కు సాహా రిప్లై ఇవ్వలేదు. దీనితో ఆ జర్నలిస్ట్​ సహాను టార్గెట్​ చేస్తూ వరుస మెసేజ్​లు పెట్టాడు. అందులో ఇంటర్వ్యూ ఇవ్వాలని సాహాను బలవంతం చేశాడు. దీనితో జర్నలిస్ట్​పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సహా ఆ స్క్రీన్​షాట్​ను ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు.

దీనితో ఈ విషయంపై మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ.. ఆ జర్నలిస్ట్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీసీఐ ఇలాంటి విషయాలపై దృష్టి సారించాలని సూచనలు చేశారు.

సాహాకు జరిగినట్లు మరో ఆటగాడికి జరగకముందే.. జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Also read: Rahul Dravid-Saha: సాహా వ్యాఖ్యలు నన్నేమీ బాధించలేదు: రాహుల్‌ ద్రవిడ్‌

Also read: Gujarat Titans Logo: గుజరాత్ టైటాన్స్ ఎగిరే గాలిపటం..కొత్త లోగో ఆవిష్కరణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News