Kohli talks about Anushka: న్యూఢిల్లీ: టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ( Virat Kohli ) తన జీవిత భాగస్వామి అనుష్క శర్మ ( anushka sharma ) పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. అనుష్క తనను పూర్తిగా మార్చిందని, ఆమె జీవిత భాగస్వామిగా దొరకడం తన అదృష్టమంటూ పేర్కొన్నాడు. నిరంతరం మంచి కోసం తపనపడుతుందని, తన క్రికెట్​ కెరీర్​తో పాటు జీవితానికి ఎంతో మేలు చేసిందంటూ వెల్లడించాడు. భారత టెస్టు క్రికెట్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal )​ చేసిన ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లి ఈ విషయాలను పంచుకున్నాడు. అయితే.. అనుష్క గురించి విరాట్ కోహ్లీ పంచుకున్న విషయాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ( BCCI ) మంగళవారం ట్విట్టర్​లో పోస్ట్ చేసింది.  Also read: IPL 2020: క్రికెటర్ల వెంట లవర్స్‌, బీసీసీఐ దారెటు?



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంకా కోహ్లీ ఎం చెప్పాడంటే.. అన్ని విషయాల్లో విభిన్న కోణాన్ని కూడా చూసేలా నేను మారానంటే అందుకు పూర్తి క్రెడిట్  అనుష్కకే దక్కుతుందన్నాడు. తాము ఒకరి నుంచి ఒకరం నిరంతరం చాలా నేర్చుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అనుష్క జీవితంలోకి రాకముందు తాను ఎక్కువగా భావాలు వ్యక్తపరిచేవాడిని కాదని, ప్రాక్టీకల్​గా ఆలోచించేవాడిని కాదంటూ చెప్పాడు. ఆమె వల్లె తన మైండ్​సెట్ మారిందని, ఇప్పుడు చాలా విషయాలను అర్థం చేసుకుంటున్నానని, దీనికి ఫుల్ క్రెడిట్ ఆమెదేనంటూ కోహ్లీ ప్రశంసించాడు.  BCCI అవమానించినా ఆశ్చర్యపోలేదు: Yuvraj Singh


ఇదిలాఉంటే.. విరాట్, బాలీవుడ్ నటి అనుష్క శర్మ 2017 డిసెంబర్​లో వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి అనుష్క గురించి కోహ్లీ చాలాసార్లు తన మనోగతాన్ని పంచుకున్నాడు. BCCI: సౌరవ్ గంగూలీ దాదాగిరి ముగిసిందా?