క్రికెట్ ప్రేమికుల ఫేవరిట్ గేమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ ( IPL 2020 ) సీజన్ ఇటీవలే ప్రారంభం అయింది. గత రెండు రోజులుగా అటు ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరాటాన్ని, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య సూపర్ ఓవర్ థ్రిల్ ను క్రికెట్ లవర్స్ బాగా ఎంజాయ్ చేశారు. నేడు ఐపీఎల్ 2020 లో మూడో మ్యాచు రాయ్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య కాసేపట్లో ప్రారంభం కానుంది. దీంతో క్రికెట్ ప్రేమికుల ఈ మ్యాచ్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ప్రతీ మ్యాచులో ఒక రికార్డు క్రియేట్ అవుతోంది అన్నట్టుగా సాగుతున్న ఐపీఎల్ 2020లో ఈ సారి మరో రికార్డు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ | IPL 2020: ఐపీఎల్ లో మనం మిస్సయ్యే టాప్ 5 విషయాలివే


హైదరాబాద్ తో జరగనున్న మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ టీమ్ గనక విజయం సాధిస్తే ఐపీఎల్ లో 50 మ్యాచులు గెలిచిన 4వ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ( Virat Kohli ) రికార్డు క్రియేట్ చేస్తాడు. అందుకే ఈ మ్యాచు కోహ్లీకి చాలా ప్రత్యేకం. ఐపీఎల్ మ్యాచుల్లో అత్యధిక విజయాలు సాధించిన సారధిగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాప్ లో ఉన్నారు.ర మొత్తం 105 మ్యాచులను ధోనీ (MS Dhoni ) కెప్టెన్సీలో చెన్నై టీమ్ విజయం సాధించింది. అంటే విజయాల్లో ధోనీ సెంచరీ కొట్టేశాడు. ధోనీ తరువాత ఆ స్థానంలో ఉన్నాడు కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ మాజి కెప్టెన్ గౌతమ్ గంభీర్. గౌతం 71 విజయాలను సాధించాడు.



ALSO READ| Cricketers Talent: మన క్రికెటర్లు క్రికెటర్స్ కాకపోయి ఉంటే ఏం చేసేవాళ్లో తెలుసా?


ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) 60 విజయాలతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక 2011 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కు కెప్టెన్సీ చేస్తున్న కోహ్లీ ఇప్పటి వరకు 100 మ్యాచులను లీడ్ చేయగా 49 మ్యాచుల్లో విజయం సాధించాడు. ఇక రోహిత్  4 సార్లు, ధోనీ 3 సార్లు, గంభీర్ 2 సార్లు చొప్పన ఐపీఎల్ టైటిల్ సాధించగా.. కోహ్లీ మాత్రం ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించలేదు.


60 విజయాలతో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. 2011 నుంచి ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న కోహ్లి.. 100 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేయగా.. 49 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించింది. రోహిత్ నాలుగుసార్లు, ధోనీ మూడుసార్లు, గంభీర్ రెండుసార్ల చొప్పున ఐపీఎల్ టైటిల్ గెలవగా.. కోహ్లి సేన మాత్రం ఇప్పటి వరకూ కప్ గెలవలేకపోయింది.



ALSO READ|  IPL Records: ఐపిఎల్ ఫైనల్స్ లో 50 కొట్టిన కెప్టెన్లు .. వారి పేర్లు ఇవే



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే     ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR