అబుదాబి: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) యంగ్ టాలెంట్ ప్రియం గార్గ్ (Priyam Garg)‌ నేటి ఐపీఎల్ 2020 (IPL 2020) మ్యాచ్‌లో అద్బుతమైన ఫీల్డింగ్‌ విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Night Riders)తో ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో 2  వరుస ఓవర్లలో  రెండు స్టన్నింగ్ క్యాచ్‌లు అందుకున్నాడు ప్రియం గార్గ్ (Priyam Garg). క్రీజులో కుదురుకున్న కేకేఆర్ కీలక ఆటగాడు శుభ్‌మన్ గిల్(36)తో పాటు, హార్డ్ హిట్టింగ్ కోసం యత్నిస్తున్న నితీష్ రాణా (29)ల క్యాచ్‌లు అందుకుని హైదరాబాద్ జట్టులో ఆనందాన్ని నింపాడు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేకేఆర్ ఇన్నింగ్స్ 12వ ఓవర్‌ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్‌లో నాలుగో బంతిని భారీ షాట్ కొట్టేందుకు యత్నించాడు. దూరం నుంచి పరుగెత్తుకుంటూ డీప్ మిడాన్ వైపు వచ్చిన ప్రియం గార్గ్ డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. గిల్ నిరాశగా వెనుదిరిగాడు. 



 



ఆ మరుసటి ఓవర్ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ వేశాడు. 13వ ఓవర్ తొలి బంతికి నితీష్ రాణాను విజయ్ శంకర్ పెవిలియన్ బాట పట్టించాడంటే గార్జ్ స్టన్నింగ్ క్యాచ్ అందుకు కారణం. 87 పరుగుల వద్ద గిల్ ఔట్ కాగా, 88 పరుగుల వద్ద రాణా వికెట్‌ను కోల్పోయింది కేకేఆర్. ప్రియం గార్గ్ మెరుపు వేగంతో మైదానంలో కదలడంతో మధ్య ఓవర్లలో కేకేఆర్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయి పరుగులు చేయడానికి తంటాలు పడింది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe