శుక్రవారం సన్ రైజర్స్  హైదరాబాద్ టీమ్ తో ( SRH ) చెన్నై సూపర్ కింగ్స్  తలపడింది. ఆ గేమ్ లో సన్ రైజర్స్ విజయం సాధించింది. ధోనీ సేన ఐపీఎల్ 2020లో ( IPL 2020) వరుసగా మూడో ఓటమిని నమోదు చేసింది. దుబయి అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచులో సీఎస్కే టీమ్ 165 పరుగులు చేయాల్సి ఉంది. అయితే 20 ఓవర్లలో కేవలం 157 రన్స్ మాత్రమే చేయగలిగింది. చెన్నై టీమ్ ను గెలిపించే బాధ్యతను రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ తమ భుజాలపై వేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ| What Is Sonic Boom: ప్యారిస్ ను వణికించిన సోనిక్ బూమ్ అంటే ఏంటి ? ఎందుకలా జరిగింది ?


కానీ ధోనీ తన మ్యాజిక్ చేయలేకపోయాడు. 36 బంతుల్లో 47 పరుగులు చేసిన ధోనీ ( MS Dhoni ) సన్ రైజర్స్  బౌలర్లను ధీటుగా ఎదుర్కోలేకపోయాడు. 39 సంవత్సరాల ధోనీ క్రికెట్ లో అత్యంత ఫిట్ గా ఉన్న ఆటగాళ్లలో ఒకరు. కానీ దుబయి ఎండలో ధోనీ తన నేచురల్ గేమ్ ను చూపించడంలో ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. దీని గురించి స్పందించిన ధోనీ.. తనకు ఏమైందో చెప్పాడు. తన గొంతు ఎండటంతో దగ్గు వచ్చింది అని తెలిపారు.


"నేను గ్రౌండ్ లో ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ సమయం ఉండటానికి ప్రయత్నించాను. కానీ అక్కడ చాలా పొడిగా ఉంది. దాంతో గొంతు పూర్తిగా డ్రై అయిపోయింది. దాంతో దగ్గు వచ్చింది.  అయినా కానీ టీమ్ ( CSK ) విజయం కోసం దాన్ని భరించేందుకు అంగీకరించానని" తెలిపాడు.  



ALSO READ|  IPL 2020: ఐపీఎల్ లో ఎక్కువ సార్లు టీమ్స్ మార్చిన ప్లేయర్స్ వీరే


తను బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాను అని...అందుకే చాలా గట్టిగా బంతులను కొట్టడానికి ప్రయత్నించాను అని తెలిపాడు. అయితే వికెట్ చాలా స్లోగా ఉంది అని. అందుకే ఎక్కువ సమయం తీసుకున్నాను అని తెలిపాడు. 



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR