Amit Shah Nirmal meeting speech highlights: నిర్మల్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ నిర్మల్‌లో పర్యటించారు. నిర్మల్ బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా.. తెలంగాణ బీజేపి శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేలా పలు వ్యాఖ్యలు చేశారు. 2023లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేసిన అమిత్ షా.. బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరుపుతాం అని పునరుద్ఘాటించారు. ఎంఐఎం పార్టీని చూసి భయపడేవాళ్ళు భయపడతారేమో కానీ బీజేపీ భయపడదు అని అమిత్ షా వ్యాఖ్యానించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

September 17 in Telangana history - సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సం:
సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సంగా అధికారికంగా నిర్వహిస్తాం అని ప్రకటించిన కేసీఆర్ వాగ్దానం ఏమైందని అమిత్ షా ప్రశ్నించారు. కేసీఆర్ ఎవరికి భయపడుతున్నాడు ? ఎందుకు భయపడుతున్నాడు ? తెలంగాణ నిజాం పరిపాలనలో ఉన్నప్పుడు నిర్మల్‌లో (Nirmal) 1000 మందిని ఉరితీసిన విషయం సీఎం కేసీఆర్‌కు గుర్తురావడంలేదా అని నిలదీశారు.


Amit Shah on Bandi Sanjay pada yatra - ప్రజల కోసమే బండి సంజయ్ 'ప్రజా సంగ్రామ యాత్ర':
తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజల కోసమే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారని అమిత్ షా అన్నారు. బండి సంజయ్‌తో పాదయాత్ర చేస్తున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్న అమిత్ షా.. 119 నియోజకవర్గాలలో బండి సంజయ్ పాదయాత్ర పూర్తి చేసుకుని వస్తారని, ప్రజల కోసం, ఆదివాసీల కోసం, తెలంగాణ కోసం, అందరికోసం బండి పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు. ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా బండి పాదయాత్ర నిర్విఘ్నంగా జరుగుతుందని చెప్పి బండి సంజయ్‌తో పాటు (Bandi Sanjay) ఆయన వెన్నంటి ఉన్న బీజేపి నేతల్లో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.


Also read : Saidabad rape case accused Raju suicide case: రాజు ఆత్మహత్య కేసుపై విచారణకు ఆదేశించిన తెలంగాణ హై కోర్టు


PM Modi birthday - ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఒక హామీ ఇస్తున్నా..
ఇవాళే ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం కూడా. దేశవ్యాప్తంగా 130 కోట్ల మంది భారతీయులు ప్రధాని మోదీ బాగుండాలని ప్రార్థనలు చేస్తున్నారు. మోదీ ఇంకా మంచి ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే మోదీ పుట్టిన రోజు సందర్భంగా మీకు ఒక మాట ఇస్తున్నా. 2023 ఎన్నికల్లో తెలంగాణలో పక్కాగా గెలిచి 119 అసెంబ్లీ స్థానాలను మోదీ ఖాతాలో వేస్తాం.


119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపి అంటే ఏంటో చూపిస్తాం అని అమిత్ షా ప్రకటించారు. ఇది నేను మీకు ఇస్తున్న హామీ అని ప్రకటించడం ద్వారా బీజేపి శ్రేణుల్లో అమిత్ షా కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నంచేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా డబ్బుతో ఆ ఎన్నికల్లో గెలవొచ్చని టీఆర్ఎస్ (TRS party) అనుకుంటోంది. కానీ అది నిజం కాదని, ప్రజలు బీజేపి వైపు ఉన్నారని టీఆర్ఎస్ పార్టీకి తెలిసొచ్చేలా చేద్దాం అని అమిత్ షా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


Also read : Saidabad Raju Case: ఎన్‌కౌంటర్ చేస్తామన్న 1 రోజు తరువాత నిందితుడి మృతదేహం.. రేకెత్తిస్తున్న పలు అనుమానాలు!


Amit Shah slams Asaduddin Owaisi and KCR - అసదుద్దిన్ ఒవైసి చేతిలో కేసీఆర్ కారు స్టీరింగ్..
పరిచయ క్రమంలో బండి సంజయ్‌తో పాటు హుజూరాబాద్ ఉప ఎన్నిక బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్‌ను కూడా వేదికపై ముందుకు రమ్మని ఆహ్వానించిన అమిత్ షా.. ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న ఈటల రాజేందర్‌ను (Eetala Rajender) ఎలా పక్కన బెట్టాడో మనకి తెలుసు అని అన్నారు. తెలంగాణలో తండ్రి, కొడుకు, కూతురు.. ఇలా కుటుంబ పాలనే తప్ప ఇంకేమీ లేదని మండిపడ్డారు. తెలంగాణకు అసలైన స్వాతంత్రం వచ్చేది ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టినప్పుడే అని విరుచుకుపడిన అమిత్ షా.. కారు కేసీఆర్‌దే అయినప్పటికీ.... దాని స్టీరింగ్ మాత్రం ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) చేతిలోనే ఉందని ఎద్దేవా చేశారు.


Also read : Saidabad Raju Suicide: మానవ మృగం ఎలా చనిపోయిందంటే..?? ప్రత్యక్ష సాక్షి వివరణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook