Saidabad Raju Suicide: మానవ మృగం ఎలా చనిపోయిందంటే..?? ప్రత్యక్ష సాక్షి వివరణ

ఉదయం  8.40 గం.లకు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎదురుగా వెళ్లి రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్తున్నారు, వారు చెప్పిన వివరాలు చూస్తే...??

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2021, 02:32 PM IST
  • కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కింద పడి నిందితుడు మృతి
  • రైల్వే సిబ్బందిని చూసి పొదల్లో దాక్కున్న నిందితుడు
  • పచ్చ బొట్టు ద్వారా నిర్దారణ చేసిన పోలీసులు
Saidabad Raju Suicide: మానవ మృగం ఎలా చనిపోయిందంటే..?? ప్రత్యక్ష సాక్షి వివరణ

Saidabad Rape case Suspect Raju suicide: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం శృష్టించిన సైదాబాద్ ఆరేళ్ల బాలికపై అత్యాచార నిందితుడు వరంగల్-ఘట్‌కేసర్ రైల్వే మార్గంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం 8.40 గంటల సమయంలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కింద పడి మరణించినుట్ల రైల్వే సిబ్బంది చెబుతున్నారు మరియు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన దాని ప్రకారం ఆత్మహత్య అని నిర్దారణ అయింది. 

ప్ర‌త్య‌క్ష సాక్షి, రైల్వే సిబ్బంది కుమార్ క‌థ‌నం ప్ర‌కారం.. స్టేష‌న్ ఘ‌న్‌పూర్ రాజారాం బ్రిడ్జి వ‌ద్ద ఓ వ్య‌క్తి గురువారం ఉద‌యం అనుమానాస్పదంగా తిరుగుతున్న‌ట్లు కనిపించాడు. దాదాపు 10 నిమిషాల పాటు అతడి గురించి ఎదురుచూసిన రాలేదని, తరువాత మేము 200 మీట‌ర్లు ముందుకెళ్లామని తెలిపారు. 

Also Read: CPL 2021 final: డ్రేక్స్ అద్భుత బ్యాటింగ్..విజేతగా డీజే బ్రావో టీమ్

ఉద‌యం 8:40 గంట‌ల‌కు హైద‌రాబాద్ వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన స‌మీప రైతులు మాకు స‌మాచారం అందించారు.  అక్కడికి వెళ్లి చూడగా తమను చూసి పొదల్లోకి పారిపోయిన వ్యక్తి అతడేనని వారు గుర్తించారు. గుర్తులను బట్టి సైదాబాద్ రాజుగా అనుమానించి వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడి చేతిపై ఉన్న పచ్చబొట్ల ఆధారంగా రాజుగా నిర్ధారించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. 

Also Read: Ap High Court Green Signal: ఏపీలో తొలగిన ఉత్కంఠత, పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు గ్రీన్ సిగ్నల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News