సింగరేణి (Singareni Blast) లో జరిగిన ప్రమాదంపై కేంద్ర మంత్రులకు పిర్యాదు చేస్తానని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనిలో భారీ పేలుడు సంభవించి నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు చనిపోవడం తెలిసిందే. ఈ ప్రమాదంపై విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మృతి చెందిన కార్మికులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో 2 ప్యాకెట్ల కండోమ్స్ పంపిణీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డైరెక్టర్ జనరల్ ఆఫ్ కోల్ మైన్స్ సేఫ్టీ అధికారులు తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో ఓబీ పనుల్లో బినామీలతో కాంట్రాక్టు పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. మృతిచెందిన కుటుంబాలకు సింగరేణిలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో అధికారులకు అక్షయ పాత్రగా ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టర్లు మారిపోయారని మండిపడ్డారు.   గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్


సింగరేణిలో కాంట్రాక్టులు కేటాయించి, అనంతరం పనులపై పర్యవేక్షణ చేయని అధికారుల వైఫల్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి నిబంధనలను గాలికి వదిలి వేయటంతో ప్రమాదాలు జరిగి కార్మికులు బలవుతున్నారని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.


కాగా, బ్లాస్టింగ్‌కు సంబంధించిన ముడి పదార్థాలను నింపుతుండగా ఓపెన్ కాస్ట్-1లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. గోదావరఖనిలోని సింగరేణి హాస్పిటల్‌కు మృతదేహాలను తరలించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి