తెలంగాణ ( Telangana ) లో రాజకీయం ఉద్రిక్తతకు దారితీస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ( Bjp president Bandi Sanjay ) అరెస్టుకు నిరసనగా ఓ కార్యకర్త ఆత్మహత్యకు ( Bjp Worker attempts suicide ) ప్రయత్నించడం కలకలం రేపింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దుబ్బాక ఉప ఎన్నికల ( Dubbaka by elections ) నేపధ్యంలో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ( TRS ) , బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేశారు.  బండి సంజయ్ అరెస్టు ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. శ్రీనివాస్ అనే కార్యకర్త పార్టీ ఆఫీసు ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే మంటలార్పి..సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడు శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా యాచారంకు చెందినవాడు. Also read: Dubbaka Bypoll: ప్రజలకు తెలియాలంటూ.. కేటీఆర్ ఆసక్తికర ట్విట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe