TSPSC Chariman: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ (TSPSC Chariman) మరియు కమిషన్ సభ్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదనలకు రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి (ఐఎఎస్)ను నియమించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కమిషన్ సభ్యులుగా సుమిత్రా ఆనంద్ తనోబా (ఎంఎ తెలుగు, తెలుగు పండిట్), కారం రవీందర్ రెడ్డి (బికాం, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి), ఆరవెల్లి చంద్రశేఖర్ రావు (బి.ఎ.ఎమ్.ఎస్ (ఉస్మానియా), ప్రాక్టీసింగ్ ఆయుర్వేదిక్ డాక్టర్), మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ (బిఎ, జర్నలిస్ట్), సీబీఐటీ ప్రొఫెసర్ బి లింగారెడ్డి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కోట్ల అరుణకుమారిలను తెలంగాణ (Telangana) ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేశారు.


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరింత ఆలస్యం



టీఎస్‌పీఎస్సీ చైర్మన్ మరియు కమిషన్ నూతన సభ్యల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా, నాలుగు వారాల్లోగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు సభ్యులను నియమించాలని రాష్ట్ర హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలుకానుంది.


Also Read: Gangula Kamalakar: పదవులు పట్టుకుని వేలాడుతున్నది నువ్వే బిడ్డా.. ఈటలకు కౌంటర్ అటాక్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook