Ayushman Bharat Scheme: ఎట్టకేలకు ఆయుష్మాన్ భారత్‌‌కి ఓకే చెప్పిన తెలంగాణ సర్కారు

Telangana govt to implement Ayushman Bharat Scheme: హైదరాబాద్: కేంద్రం అమలు చేస్తోన్న ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరనున్నట్లు తెలంగాణ సర్కార్ స్పష్టంచేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాతీయ ఆరోగ్య శాఖతో ఎంవోయూ(MoU)పై సంతకాలు చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2021, 12:50 AM IST
Ayushman Bharat Scheme: ఎట్టకేలకు ఆయుష్మాన్ భారత్‌‌కి ఓకే చెప్పిన తెలంగాణ సర్కారు

Telangana govt to implement Ayushman Bharat Scheme: హైదరాబాద్: కేంద్రం అమలు చేస్తోన్న ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరనున్నట్లు తెలంగాణ సర్కార్ స్పష్టంచేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాతీయ ఆరోగ్య శాఖతో ఎంవోయూ(MoU)పై సంతకాలు చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ఈ ఒప్పందంపై సంతకం చేసినట్టు సీఎంవో తమ ట్వీట్‌లో పేర్కొంది. 

తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఖారారు చేసిందని.., ఆ ప్రకారమే నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎం ఆదేశించినట్టు సీఎంఓ వెల్లడించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎ.ఎం. రిజ్వీ, రాష్ట్ర ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈఓకు అమలుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసినట్టు తెలంగాణ సీఎంఓ తెలిపింది.

Trending News