PK TEAM: దేశంలో ఎన్నికల వ్యూహకర్తల్లో టాప్ ప్రశాంత్ కిషోర్. ఆయన టీమ్ కోసం పార్టీలు పోటీ పడుతుంటాయి.గత ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీకి పని చేసింది పీకే టీమ్. బీజేపీ ఎత్తుగడలకు  చెక్ పెడుతూ మమతా బెనర్జీ మరోసారి గెలవడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే పని చేశాయని చెబుతారు. కొంత కాలంగా తెలంగాణలో టీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పీకే టీమ్ పలు సర్వేలు నిర్వహించింది. సీఎం కేసీఆర్ కు ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తోంది. ప్రశాంత్ కిషోర్ కూడా కేసీఆర్ తో సుదీర్ఘ మంతనాలు సాగించారు. అయితే తాజాగా పీకే టీమ్ తెలంగాణ నుంచి వెళ్లిపోయిందని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో 40 పీకే టీమ్ లు పని చేస్తున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ టీమ్ లు తిరిగి నివేదికలు రూపొందించాయని తెలుస్తోంది. అయితే ప్రశాంత్ కిషోర్ టీమ్ లు ఇస్తున్న నివేదికలపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇంటలిజెన్స్ నుంచి వస్తున్న రిపోర్టులకు పీకే టీమ్ ఇస్తున్న నివేదికలకు అసలే పొంతనే ఉండటం లేదట. ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్న కేసీఆర్... పీకే టీమ్ సేవలను తగ్గించారని అంటున్నారు. పీకే టీమ్ సర్వేలు ఇతర పార్టీలకు లీక్ అవుతున్నాయనే అనుమానాలు కేసీఆర్ కు ఉన్నాయంటున్నారు. కొన్ని రోజుల క్రితం పీకే టీమ్ సర్వే ఇదేనంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ సర్వేను విడుదల చేశారు. తర్వాత కూడా పీకే టీమ్ పేరుతో సర్వేలు సోషల్ మీడియాలో వచ్చాయి. దీంతో పీకే టీమ్ వివరాలు బయటికి లీక్ అవుతున్నాయనే భావనలో గులాబీ బాస్ ఉన్నారంటున్నారు.


పార్టీ నేతల నుంచి పీకే టీమ్ సర్వేలపై ఫిర్యాదులు కేసీఆర్ కు వచ్చాయంటున్నారు. పీకే టీమ్ ప్రతినిధులు కొందరు నియోజకవర్గంలోని నేతలతో కుమ్మక్కై కావాలనే తప్పుడు నివేదికలు ఇచ్చారని కొందరు ఎమ్మెల్యేలు ఆరోపించారని చెబుతున్నారు. పార్టీ నేతల నుంచి వస్తున్న ఫిర్యాదులు, తనకు పీకే టీమ్ నుంచి వస్తున్న నివేదికలపై గుర్రుగా ఉన్న కేసీఆర్.. పీకే టీమ్ అవసరం లేదనే నిర్ణయానికి వచ్చారంటున్నారు. కేసీఆర్ తీరుతో పీకే టీమ్ లు తెలంగాణలో పని చేయడం మానేశాయని తెలుస్తోంది. గత నెల రోజులుగా మునుగోడులో తిరిగిన పీకే టీమ్ లు కూడా వెనక్కి వచ్చేశాయని అంటున్నారు.తెలంగాణలో పని చేస్తున్న టీమ్ లను ఏపీకి పంపించారని తెలుస్తోంది. 2024 ఎన్నికల కోసం ఏపీలో వైసీపీ కోసం పని చేస్తోంది పీకే టీమ్. ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐప్యాక్ కార్యాలయాన్ని కూడా ఏపీకి తరలించనున్నారని తెలుస్తోంది.


మరోవైపు పీకే టీమ్ పని చేయడం మానేసిందని తెలిసి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సంబరాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సిట్టింగులను మార్చాలని కేసీఆర్ కు పీకే టీమ్ నివేదిక ఇచ్చిందని గతంలో వార్తలు వచ్చాయి. పీకే టీమ్ సర్వే ఆధారంగానే టికెట్లు కేటాయిస్తారనే ప్రచారంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరేషాన్ అయ్యారు. తమ గురించి పీకే టీమ్ ఎలాంటి నివేదిక ఇస్తుందోనని ఆందోళన చెందారు. ఇప్పుడు పీకే టీమ్ తెలంగాణలో సర్వే చేయడం మానిసేందని తెలియడంతో టీఆర్ఎస్ నేతలు లోలోపల ఖుషీ అవుతున్నారని తెలుస్తోంది.


Read also: Prakash Raj Village: మేం అభివృద్ధి చేస్తే ప్రకాష్ రాజ్ ను పొగడటమేంటీ.. కేటీఆర్ కు షాకిచ్చిన సర్పంచ్


Read also: CM Jagan Kuppam Tour: సీఎం హోదాలో తొలిసారి కుప్పంకు జగన్.. చంద్రబాబే ఫస్ట్ టార్గెట్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి