Prakash Raj Village: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఓ సర్పంచ్ షాకిచ్చారు. కేటీఆర్ చేసిన ట్విట్టర్ పోస్టుకు కౌంటరిచ్చాడు. ఈ ఘటన కేటీఆర్ ను ఇబ్బందులకు గురి చేసింది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకర్గంలోని కేశంపేట మండలం కొండారెడ్డి పల్లి గ్రామాన్ని హీరో ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్నారు. తన సొంత నిధులతో ఆయన గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే గ్రామంలో జరిగిన అభివృద్ధి విషయంలో ప్రకాష్ రాజ్, గ్రామ సర్పంచ్ మధ్య విభేదాలు ఉన్నాయి.
కొండారెడ్డి పల్లి గ్రామం బాగా అభివృద్ది చెందిందని.. ఊరు రూపు రేఖలు మారిపోయాయని ఆ గ్రామానికి చెందిన మధుసూదన్ రావు ట్విట్టర్ లో పోస్టు చేశారు. గ్రామంలోని రోడ్లు , ఫుట్ పాత్ లు , గ్రీనరికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కొన్ని ఫోటోలను అందులో పెట్టారు. ఆ పోస్టును మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. ఆ ట్వీట్ కు స్పందించారు మంత్రి కేటీఆర్. కొండారెడ్డి పల్లిని హీరో ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్నారని చెప్పారు. గ్రామ అభివృద్ధికి ప్రకాష్ ఎంతో చొరవ తీసుకున్నారని కొనియాడారు. 2015లో ప్రకాష్ రాజ్ కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్నారు. ప్రకాష్ రాజ్ తోపాటు గ్రామ ప్రగతికి కారణమైన స్థానిక ఎమ్మెల్యే అంజయ్యకు శుభాకాంక్షలు చెబుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
This is the village adopted by @prakashraaj
Great progress made in tandem with local MLA @AnjaiahYTRS Garu 👏 https://t.co/yGfYdloaFT
— KTR (@KTRTRS) September 20, 2022
కొండారెడ్డి అభివృద్ధిపై కేటీఆర్ చేసిన ట్వీట్ పై గ్రామ సర్పంచ్ పల్లె స్వాతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాన్ని తమ సొంత నిధులతో అభివృద్ధి చేసుకున్నామని, కేటీఆర్ పూర్తిగా తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని చెప్పారు. గ్రామంలో జరిగిన అభివృద్ది పనులకు ప్రకాష్ రాజ్ కంటే తామే ఎక్కువ నిధులు ఖర్చు పెట్టామని సర్పంచ్ తెలిపారు. తమను అభినందించకుండా క్రేడిట్ మొత్తం ప్రకాష్ రాజ్ కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు కొండారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్. పైసలు మేం ఖర్చు పెడితే ప్రశంసలు ప్రకాష్ రాజ్ కా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
Read also: CM Jagan Kuppam Tour: సీఎం హోదాలో తొలిసారి కుప్పంకు జగన్.. చంద్రబాబే ఫస్ట్ టార్గెట్?
Read also: Raj yog: 59 ఏళ్ల తర్వాత రేపు 5 రాజయోగాలు.. ఈ 5 రాశుల వారికి గుడ్ టైమ్ స్టార్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి