హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని నగరంలో నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా యాక్టివ్ కేసులు లేవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలు చేయాలని, ఈ నెల 17తో ముగుస్తున్న దేశ వ్యాప్త లాక్ డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను పరిశీలించి, రాష్ట్రంలో అనుసరించే వ్యూహం ఖరారు చేస్తామని సీఎం (KCR) తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు కొనసాగిస్తూనే, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా (Coronavirus) వ్యాప్తి నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ఎంతటివారైనా సహించేది లేదు.. ఎంపీ రంజిత్ రెడ్డి


Telangana రాష్ట్రంలో కరోనా వైరస్ హైదరాబాద్ నగరంలోని కేవలం(GHMC)లో నాలుగు జోన్లకే పరిమితం అయిందని, ఎల్.బి.నగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలోనే ప్రస్తుతం యాక్టివ్ కేసులున్నాయన్నారు. ఈ జోన్లలో 1442 కుటుంబాలుండగా యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాలకు చెందిన వలస కూలీలకు కొందరికి వైరస్ సోకినట్లు తేలిందన్నారు. కాగా వలస కూలీలు హైదరాబాద్ లోనే చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఆర్టీఏ కార్యాలయాల  అందుబాటులోకి వస్తాయని, మిగతా లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలవుతాయన్నారు. కేంద్రం విధించిన తాజా (LOCKDOWN) లాక్ డౌన్ గడువు ఈ నెల 17తో ముగుస్తుండగా ఈ సందర్భంగా కేంద్రం మరికొన్ని మార్గదర్శకాలు జారీ చేసే అవకాశముందన్నారు. 


Also Read: దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట..


విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో, వివిధ రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రానికి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, విమానాల ద్వారా హైదరాబాద్ చేరుకునే తెలంగాణ వాసులకు(Corona Testing) పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలకు మంచి స్పందన వచ్చిందని, ప్రస్తుతం 123 బస్తీ దవాఖానాల ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మరో 45 బస్తీ దవాఖానాలు వెంటనే ప్రారంభించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావులను ఆదేశించారు. 


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  


Read Also: కీలక ప్రకటన చేసిన ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్..