న్యూఢిల్లీ: ఆత్మ నిర్భర భారత్ (Atmanirbhar Bharat) ప్యాకేజీ ద్వారా నేడు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్(Finance Minister Nirmala Sitharaman)మూడో రోజు ప్రకటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. అంతర్ రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై పరిమితులను తొలగించటం కోసం, జాతీయ స్థాయిలో చట్టం రూపకల్పన అమోఘమని ఆయన కొనియాడారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ విపణిలో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట, దేశవ్యాప్తంగా ఎక్కడ మంచి ధర వస్తే అక్కడే తమ పంటలు అమ్ముకునే అవకాశం రైతులకు మేలు చేకూరుస్తుందన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థకు ₹500 కోట్లు, కూరగాయలు, ఉల్లిపాయలు, పండ్ల సరఫరాకు ఆపరేషన్ గ్రీన్, రవాణ ఖర్చుల్లో 50%, శీతల గోదాముల రుసుముల్లో 50% రాయితీ, ఔషధ పంటలకు రూ. నాలుగు వేల కోట్లు, తేనే టీగల సంరక్షణకు ₹500 కోట్లు, నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు ఆధ్వర్యంలో 2.25 లక్షల హెక్టార్లలో ఔషధ పంటలు పండించేలా ప్రోత్సాహం, ఇస్తున్నట్లు ప్రకటించడం ఎంతో మంది రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు.
Read Also: కీలక ప్రకటన చేసిన ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్..
ఆహారం రంగంలోని సూక్ష్మ పరిశ్రమలకు(MSMEs) ₹10 వేల కోట్లు, ముఖ్యంగా మహిళల కేంద్రంగా ఈ కేటాయింపులు, దేశవ్యాప్తంగా ఉన్న సుమారు రెండు లక్షల సూక్ష్మ, చిన్న సంస్థలకు దీంతో ప్రయోజనం కలుగుతుందని, వారికి అనుబంధంగా ఉన్న మరిన్ని లక్షల మందికి మేలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా మత్స్య సంపద యోజనకు ₹20 వేల కోట్లు, దేశంలో మత్స్యకార రంగంలో 55 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. వ్యక్తిగత బోట్లు, మత్స్యకారులకు బీమా సదుపాయం, రానున్న అయిదేళ్లలో 70 లక్షల టన్నుల అదనపు మత్స్య ఉత్పత్తి లక్ష్యంగా పేర్కొనడం ఆ రంగానికి మేలు చేయనుందన్నారు. గడిచిన రెండు నెలల్లో(Pradhan Mantri Fasal Bima Yojana) PMFBY ఫసల్ బీమా యోజన కింద ₹6,400 కోట్లు పరిహారం, ₹74,300 కోట్లు మేర కనీస మద్దతు ధరల ప్రకారం కొనుగోళ్లు, వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరించిందన్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..