కీలక ప్రకటన చేసిన ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్..

ఆత్మ నిర్భర భారత్ బృహత్కర ప్రణాళికలో భాగంగా మూడో రోజు ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.

Last Updated : May 15, 2020, 07:38 PM IST
కీలక ప్రకటన చేసిన ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్..

న్యూఢిల్లీ: ఆత్మ నిర్భర భారత్ బృహత్కర ప్రణాళికలో భాగంగా మూడో రోజు ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. రైతులు తమ ఉత్పత్తులను మెరుగైన ధరకు అమ్ముకునే అవకాశం కల్పించేలా కేంద్రం చట్టం తెస్తోందని ఆమె ప్రకటించారు. రాష్ట్రాల మధ్య ఎలాంటి అడ్డంకులు లేకుండా మెరుగైన ధరకు రైతులు ఎక్కడైనా పంటను అమ్ముకునేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రైతు పండించిన పంటను నిర్దిష్ట ప్రాంతంలోనే అతి కొద్ది మందికి మాత్రమే ఎందుకు అమ్ముకోవాలని ఆమె ఇప్పటివరకూ ఉన్న దళారీ వ్యవస్థను ఉద్దేశించి ప్రశ్నించారు.

అంతేకాకుండా మెరుగైన ధరకు ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా రైతు తన పంటను అమ్ముకునేలా చర్యలు తీసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించారు. అంతర్‌ రాష్ట్ర రవాణాకు అడ్డంకులు తొలగిస్తామని, పంట వేసే సమయంలోనే రైతుకు కనీస మద్దతు ధర ఎంతో తెలిసేలా నిర్దిష్ట కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇలాంటి ఏర్పాట్ల వల్ల లాభసాటి పంటలను రైతులు ఎంచుకునే వీలుంటుందని ఆమె చెప్పారు. సాంకేతికపరమైన సలహాలు, విత్తనాల్లాంటి సాయం రైతులకు అందుబాటులో ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. దీని వల్ల మద్దతు ధర రాకుండా రైతు నష్టపోవడం ఉండదని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.  కూరగాయల రైతులను ఆదుకునేందుకు కూడా రూ.5 వేల కోట్లతో ప్రత్యేక విధానం తీసుకురాబోతున్నట్లు తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News