Corona Patient Video Before Death | ‘ఊపిరాడుతలేదని అంటే కూడా చెప్తే వినకుండా వెంటిలేటర్ బంజేసిర్రు. సార్ సార్ అంటూ బతిమిలాడినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే మూడు గంటలైంది డాడీ.. నాకు ఊపిరాడుతలేదు డాడీ.. గుండె ఆగిపోయింది. ఊపిరొక్కటే కొట్టుకుంటుంది డాడీ.. బాయ్ డాడీ బాయ్.. అందరికీ బాయ్ డాడీ’.. అంటూ కరోనా లక్షణాలతో ఉన్న బాధితుడు 35ఏళ్ల రవికుమార్ శ్వాస విడిచేముందు చివరి క్షణంలో తీసుకున్న వీడియోను తన తండ్రికి వాట్సప్(Corona Patient WhatsApp Video)‌ చేశాడు. అప్పుడు ఈ వీడియోను చూసి దిక్కుతోచని స్థితిలో ఆ తండ్రి హృదయం ఎంత తల్లడిల్లిఉంటుందో చెప్పవచ్చు. విషాదం: పెళ్లి తంతు ముగిసేలోగా వధువు మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఈ హృదయవిదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసినవారందరి కంట కన్నీరు పెట్టిస్తోంది. కరోనా వ్యాధి (coronavirus)  సోకితే చికిత్స ఇంత దారుణంగా ఉంటుందా.. చివరికీ చనిపోతున్నామని చెబుతున్నా.. కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడా అంటూ.. ఈ వీడియోను చూసిన వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వీడియోను వైరల్ చేస్తున్నారు. భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి పైపైకి



ఈ విషాద సంఘటన హైదరాబాద్‌ (Hyderabad) ఎర్రగడ్డలోని ప్రభుత్వ చెస్ట్ ఆసుపత్రి (Govt General and Chest Hospital) లో ఈ నెల 26న జరిగింది. తన కొడుకుకి సరైన వైద్యం అందకపోవడం వల్లనే ఇలా జరిగిందని, ఈ దయనీయ పరిస్థితి ఎవ్వరికి రావొద్దని మృతుడు రవికుమార్ తండ్రి వెంకటేష్ విలపించాడు. 22న రవికి జ్వరం వస్తే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళితే కరోనా లక్షణాలుంటే చేర్చుకోమన్నారని, ఆతర్వాత దాదాపు పది ప్రైవేటు ఆసుపత్రులు తిరిగినా... నిమ్స్, గాంధీకి తీసుకెళ్లినా చేర్చుకోలేదన్నాడు. చివరకు ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో చేర్పించానన్నాడు. మూసాపేట ప్రైవేటు ల్యాబ్ నుంచి రిపోర్టు రాకముందే రవి మరణించగా.. మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది అప్పగించారని రోదించాడు. బికినీలో రెచ్చిపోయిన నటి.. అందాల ప్రదర్శన


అంత్యక్రియల్లో పాల్గొన్న 30మంది క్వారంటైన్..
ఆ తర్వాత ఈనెల 27న మృతదేహాన్ని కార్పొరేషన్‌లోని జవహార్ నగర్‌లో ఉన్న ఇంటికి తరలించారు. సుమారు 30మంది కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ప్రగతినగర్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత మరుసటిరోజు మృతుడు రవికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పోలీసులు, అధికారులు వెంటనే అప్రమత్తమై కుటుంబసభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచారు.  


రవికుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు..
ఏది ఏమైనప్పటికీ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకున్నట్లు కనిపిస్తోంది. కన్నవారిని, తన భార్య, పిల్లలను మంచిగా చూసుకోవాలనుకున్న అతని కల గాలిలో కలిసిపోయింది. పదేళ్లపాటు సౌదీలో పనిచేసిన రవికుమార్ రెండేళ్ల క్రితమే హైదరాబాద్‌కు తిరిగివచ్చి తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అతనికి భార్య, 12ఏళ్ల కుమార్తె, 9ఏళ్ల కుమారుడు ఉన్నారు.


జాప్యం, నిర్లక్ష్యం జరగలేదు..
ఇదిలాఉంటే రవికుమార్‌కు చికిత్స బాగానే అందించామని, చికిత్సలో జాప్యం, నిర్లక్ష్యం జరగలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ చెప్పారు. కరోనా సోకిన యువతలో వ్యాధి గుండెపై ఎక్కువగా ప్రభావితం చేస్తుందన్నారు. వెంటిలేటర్ తొలగించామనడం వాస్తవం కాదని చెప్పడం గమనార్హం. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ