Covid19 vaccination: కోవిడ్ వ్యాక్సిన్  వచ్చేస్తోంది. హైదరాబాద్‌లో వ్యాక్సిన్ పంపిణీకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరిలో వ్యాక్సిన్ అందుబాటులో రానుండటంతో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. హైదరాబాద్‌లో ఎవరికి ముందుగా వ్యాక్సిన్ వేయనున్నారంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాజధాని హైదరాబాద్ ( Hyderabad )‌లో కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) పంపిణీకు వైద్య ఆరోగ్య శాఖ ( Medical Health department ) సన్నద్ధమవుతోంది. జనవరి రెండోవారానికి వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందనే అంచనాతో ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కేంద్రం వ్యాక్సిన్ పంపిణీకు సంబంధించి మార్గదర్శకాల్ని జారీ చేసింది. కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పని చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి తొలి విడతగా వ్యాక్సిన్ వేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. 


వ్యాక్సిన్ పంపిణీ ( Vaccination ) కోసం వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఆయాల నుంచి వైద్యుల వరకూ వివరాలని ఇప్పటికే సేకరించారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ ( Central Drug store ) నుంచి వ్యాక్సిన్‌ను చింతల్ బస్తీ, బేగంబజార్, హరాజ్ పెంట, శ్రీరాంనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోని స్టోరేజ్ సెంటర్లకు తరలిస్తారు. అక్కడ్నించి ఇతర ప్రాంతాలకు చేరుస్తారు. ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్ బాక్సులు ( Cold storage boxes ) నగరానికి చేరాయి. సాధారణ వ్యాక్సిన్‌లానే కోవిడ్ వ్యాక్సిన్‌ను కూడా 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాలి. Also read: HP governor Bandaru Dattatreya: రోడ్డు ప్రమాదం ఘటనపై స్పందించిన గవర్నర్ బండారు దత్తాత్రేయ


తెలంగాణ ( Telangana ) వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందిని 2.67 లక్షలుగా గుర్తించగా..హైదరాబాద్ జిల్లా పరిధిలో 76 వేల 804 మంది, రంగారెడ్డి జిల్లాలో 25 వేల 211 మంది, మేడ్చల్‌లో 10 వేల 50 మందిని గుర్తించారు. గ్రేటర్ పరిధిలో వీరిలో 42 శాతం ఉండగా..ఒక్క హైదరాబాద్ జిల్లాలో 28 శాతం ఉన్నారు. రెగ్యులర్ వ్యాక్సన్లకు ఆటంకం లేకుండా..కోవిడ్ వ్యాక్సినేషన్, పనితీరుపై రెండ్రోజుల పాటు సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. తొలి విడత శిక్షణలో డీఎంహెచ్వో, డీఐఓ సహా పలువురు మెడికల్ ఆఫీసర్లుంటారు. తరువాత దశలో కంప్యూటర్ ఆపరేటర్లు, పీహెచ్‌సీ స్టాఫ్ నర్శులు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇస్తారు. 


పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో రెగ్యులర్ వ్యాక్సినేషన్‌కు ఇబ్బంది లేకుండా బుధ, ఆదివారాలు మినహాయించి..మిగిలిన రోజుల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. ప్రతి ఒక్క ఏఎన్ఎం ఎంపిక చేసిన ప్రాంతాల్లో వందమందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 


Also read: COVID-19 Cases: తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు