HP governor Bandaru Dattatreya: రోడ్డు ప్రమాదం ఘటనపై స్పందించిన గవర్నర్ బండారు దత్తాత్రేయ

హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ప్రయాణిస్తున్న వాహనం నిన్న సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఖైతాపురం శివారులో 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

Last Updated : Dec 15, 2020, 06:55 AM IST
HP governor Bandaru Dattatreya: రోడ్డు ప్రమాదం ఘటనపై స్పందించిన గవర్నర్ బండారు దత్తాత్రేయ

హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ప్రయాణిస్తున్న వాహనం నిన్న సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఖైతాపురం శివారులో 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకని బయల్దేరిన ఆయన ప్రయాణిస్తున్న కారు ఉన్నట్టుండి అదుపుతప్పి రోడ్డుకి ఎడమ పక్కనే ఉన్న చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది ( Bandaru Dattatreya's car meets with an accident). కారు స్టీరింగ్‌ బిగుసుకుపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో బండారు దత్తాత్రేయతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, సెక్యూరిటీ ఆఫీసర్‌ కూడా ఉన్నారు. అదృష్టవశాత్తుగా ఈ రోడ్డు ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదు. 

గవర్నర్ సెక్యురిటీ సిబ్బంది, స్థానిక పోలీసులు బండారు దత్తాత్రేయను కారులోంచి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత మరో వాహనంలో దత్తాత్రేయ అక్కడి నుంచి ముందుకు సాగిపోయారు. రోడ్డు ప్రమాదం ఘటనపై బండారు దత్తాత్రేయ ( Himachal Pradesh Governor Bandaru Dattatreya ) మాట్లాడుతూ.. స్టీరింగ్‌లో తలెత్తిన లోపం వల్లే కారు రోడ్డు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిందని.. అక్కడ ఉన్న చెట్ల వల్ల కారు వేగం అదుపులోకి రావడంతో పాటు ప్రమాదం తీవ్రత తగ్గిందని.. లేదంటే ప్రమాదం తీవ్రత పెరిగి ఉండేదని అన్నారు.

Trending News