Covid-19: తెలంగాణలో తాజాగా 2,479 కరోనా కేసులు
తెలంగాణలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ వైరస్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి.
Coronavirus Updates in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ వైరస్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో మంగళవారం ( సెప్టెంబరు 8న ) తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 2,479 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 10 మంది మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,47,642 కి చేరగా.. మరణాల సంఖ్య 916 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 31,654 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటివరకు 1,15,072 మంది బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. Also read: Shravani: వేధింపులు తాళలేక బుల్లితెర నటి బలవన్మరణం
ఇదిలాఉంటే.. నిన్న 62,649 కరోనా టెస్టులు చేయగా.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 18,90,554 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 77.9 శాతం ఉండగా.. మరణాల రేటు 0.62 శాతంగా ఉంది. నిన్న అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 322 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 188, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 183 చొప్పున కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు.. ఇలా ఉన్నాయి..
[[{"fid":"192747","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణలో కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"1"}}]]
Also read : Antarvedi radham issue: అంతర్వేది రథం దగ్ధం.. సర్కారుపై పవన్ ఘాటు వ్యాఖ్యలు