Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతుండంగా.. రెండు రోజుల నుంచి రెండువేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. అయితే కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు రికవరీల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో గురువారం ( అక్టోబరు 8 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,891 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా ఏడుగురు మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,08,535 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,208 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: NTR: అలాంటివారితో ఆన్‌లైన్ పరిచయాలొద్దు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 1,80,953 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 26,374 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 86.77 శాతం ఉండగా.. మరణాల రేటు 0.57 శాతంగా ఉంది. ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా గురువారం 53,086 కరోనా టెస్టులు చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో అక్టోబరు 8వ తేదీ వరకు రాష్ట్రంలో 34,49,925 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. Also read: Tamil Nadu COVID-19 Deaths: ఆ మార్క్ చేరిన రెండో రాష్ట్రం తమిళనాడు


ఇదిలాఉంటే.. నిన్న నమోదైన కరోనా కేసుల్లో.. అత్యధికంగా  జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 285 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 175, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 195, నల్లగొండ జిల్లాలో 128 చొప్పున పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.