Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్తా.. మూడు రోజుల నుంచి మళ్లీ రాష్ట్రంలో 1500లకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో కరోనా కేసులతోపాటు.. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అయితే గత 24 గంటల్లో గురువారం ( నవంబరు 5 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,602 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు (4) మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,47,284 కి చేరగా.. మరణాల సంఖ్య 1,366 కి పెరిగింది. Also read: Kamal Haasan: రజనీకాంత్ మద్దతు కోరుతున్నాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 982 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,26,646 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 19,272 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 91.65 శాతం ఉండగా.. మరణాల రేటు 0.55 శాతం ఉంది.  Also read: Vijay: ఆ పార్టీతో నాకు సంబంధం లేదు: తలపతి విజయ్


ఇదిలావుంటే.. గురువారం తెలంగాణ వ్యాప్తంగా 46,970 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 5వ తేదీ వరకు మొత్తం 45,31,153 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  జీహెచ్ఎంసీ పరిధిలో 295 కేసులు నమోదయ్యాయి. అయితే.. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. Also read: Covid-19: భారత విమాన సర్వీసులను రద్దు చేసిన చైనా


[[{"fid":"196845","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణలో కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"1"}}]]


 


 Also read : Noel Sean reentry: బిగ్ బాస్‌లోకి నోయల్ రీ ఎంట్రీ ఇస్తున్నాడా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe