Telangana: ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లు వాయిదా
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లు వాయిదా పడనున్నాయి. హైకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపధ్యంలో నవంబర్ 23 నుంచి ప్రారంభం కావల్సిన ధరణి రిజిస్ట్రేషన్లు వాయిదా పడుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లు వాయిదా పడనున్నాయి. హైకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపధ్యంలో నవంబర్ 23 నుంచి ప్రారంభం కావల్సిన ధరణి రిజిస్ట్రేషన్లు వాయిదా పడుతున్నాయి.
ప్రజల వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల హక్కుల పరిరక్షణ, పారదర్శకత కోసమే ధరణి వెబ్‌పోర్టల్ ( Dharani web portal )ను ప్రారంభించినట్టు తెలంగాణ ప్రభుత్వ ( Telangan Government ) ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ హైకోర్టు ( High court ) ( Telangana high court )కు నివేదించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే ఈ విధానాన్ని రూపొందించామని ప్రభుత్వం తెలిపింది. ప్రజల ఆస్తుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని..భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం పరిపాలనా పరమైన సంస్కరణలను తెచ్చిందని ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ( Somesh kumar ) తెలిపారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు ఆధార్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన లేదన్నారు.
ఇక కులం వివరాలు అడగడం లేదని.. రైతుబంధు పథకం కోసం మాత్రమే ఆధార్ వివరాలు అడుగుతున్నామని కోర్టుకు వివరించారు. పథకం అమల్లో భాగంగా..ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వివరాల్ని మాత్రమే అడుగుతున్నామని..ఏ కులమో అడగడం లేదని చెప్పారు. ధరణి పోర్టల్ కోసం ఆధార్, కులం వివరాలు అడగడాన్ని సవాలు చేస్తూ గోపాల్ శర్మ అనే న్యాయవాది పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణలో భాగంగా ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ కోర్టుకు కౌంటర్ దాఖలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్ లో కోటి ఆరు లక్షల మంది నమోదు చేసుకున్నారు. పారదర్శకత, ప్రజల ఆస్థుల రక్షణ కోసమే ఈ పోర్టల్ ప్రారంభించినట్టు తెలంగాణ ప్రభుత్వం ( Telangana government ) వివరించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ గతంలో లోపభూయిష్టంగా ఉండేదని..ఇప్పుడా పరిస్థితి లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని స్పష్టం చేసింది.
నవంబర్ 23 నుంచి వాస్తవానికి ధరణి పోర్టల్ ( Dharani portal ) ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కావల్సి ఉంది. అయిే హైకోర్టు స్టే కారణంగా బ్రేక్ పడింది. దీనిపై తదుపరి విచారణ నవంబర్ 23న జరగాల్సి ఉన్నందున..రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరోసారి వాయిదా పడే అవకాశాలున్నాయి. నవంబర్ 23 న కాకుండా..మరో నాలుగైదు రోజుల తరువాత ప్రారంభించే అవకాశాలున్నాయి. Also read: GHMC Elections: టీఆర్ఎస్‌పై ఛార్జిషీటు విడుదల చేసిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్