Health Director G. Srinivasa Rao Controversial Comments: కొత్తగూడెంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్  వేడుకల్లో తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవడంపై ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా. గడల శ్రీనివాస్‌ రావు స్పందించారు.  " దయచేసి తన వ్యాఖ్యలను వక్రీకరించొద్దని మీడియాకి విజ్ఞప్తి చేసిన శ్రీనివాస్ రావు.. కొన్ని మీడియా సంస్థల వారు తన ప్రసంగంలోని కొంత భాగాన్ని మాత్రమే కట్ చేసి, దానినే ప్రసారం చేసి వివాదాన్ని సృష్టించడం తనను తీవ్రంగా కలచివేసింది " అని ఆవేదన వ్యక్తంచేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రిస్మస్ వేడుకల్లో తాను చేసిన మొత్తం ప్రసంగాన్ని కాకుండా.. కేవలం యేసు క్రీస్తు ద్వారానే కరోనావైరస్ సమసిపోయింది అని తాను వ్యాఖ్యానించినట్టుగా అర్థం వచ్చేలా తన వీడియో క్లిప్ కట్ చేసి ప్రసారం చేయడం దురదృష్టకరం. ఈ విషయంలో తన మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఆవేదన వ్యక్తంచేశారు. 


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో, ప్రభుత్వ పనితీరు వల్ల, ఆరోగ్య శాఖలోని పై స్థాయి నుండి కింద స్థాయి ఉద్యోగుల సంపూర్ణ సహకారం వల్ల, అన్ని మతాలకు చెందిన వారు వారి వారి దేవతామూర్తులను ప్రార్థించుట వలనే కరోనా సమసిపోయిందని తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి, తప్పుడు ప్రచారం చేస్తున్నారని డా శ్రీనివాస్ రావు విచారం వ్యక్తంచేశారు.


ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. '' తాను ఏ మతం వారినీ, ఎవరి నమ్మకాలనూ కించపరచను. అలాంటి ఉద్దేశం కూడా తనకు లేదు. అన్ని మతాల వారిని ఒకే రకంగా చూస్తాను. సర్వమతాల సారం ఒక్కటే అని నమ్ముతాను '' అని అన్నారు. తాను ఏం మాట్లాడానో తెలియాలంటే దయచేసి యూట్యూబ్‌లో ఉన్న ఫుల్ వీడియో చూడాలని కోరుతున్నాను అని శ్రీనివాస్ రావు స్పష్టంచేశారు. శ్రీనివాస్ రావు ఇచ్చిన ఈ క్లారిటితోనైనా శ్రీనివాస్ రావుపై వచ్చిన వివాదం సద్దుమణుగుతుందేమో వేచిచూడాలి మరి.


ఇది కూడా చదవండి : Telangana Health Director: ఏసు క్రీస్తు వల్లే కరోనా నయం.. వివాదంలో డీహెచ్ శ్రీనివాసరావు


ఇది కూడా చదవండి : BF.7 Variant Symptoms: ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎందుకంత వణికిస్తోంది ? లక్షణాలు ఏంటి ?


ఇది కూడా చదవండి : BF.7 Variant Cases in India: వామ్మో.. చైనాను హడలెత్తిస్తున్న వేరియంట్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook