Humanity In Coronavirus Crisis: కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలు ప్రభావితం అయ్యాయి. ఇప్పటికే కోటికన్నా ఎక్కువ మందికి కోవిడ్-19 వైరస్ సోకింది. ఇలాంటి సమయంలో అప్తులు మరణించినా దగ్గరుండి వారి అంత్యక్రియలు కూడా నిర్వహించలేని పరిస్థితి. మరణించిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాని స్థితి. ఇలాంటి సమయంలో తెలంగాణలోని ( Telangana ) పెద్దపల్లి జిల్లాకు చెందిన ఒక డాక్టర్ మానవత్వానికి ( Humanity) ప్రతీకగా నిలిచాడు. Also Read : Kawasaki Syndrome: కొవిడ్-19 పోనే లేదు భారత్‌లో మరో వ్యాధి కలకలం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెద్దపల్లి ( Peddapalli District ) జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కోవిడ్-19 ( Coronavirus Deaths in Telangana ) సోకడంతో మరణించాడు. అయితే మరణించిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించడానికి , అతని మృతదేహం తరలించడానికి ఒక ట్రాక్టర్‌ను మాట్లాడారు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ మాత్రం తను డ్రాక్టర్ నడపను అని చెప్పడంతో విధుల్లో ఉన్న డాక్టర్ శ్రీరామ్ మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తీసుకుని బయల్దేరాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ యీడియాలో వైరల్ అవుతోంది. డాక్టర్ శ్రీరామ్ మంచి మనసును, అతని మానవత్వ చొరవను అందరూ మెచ్చుకుంటున్నారు.



 


Rain In Plane: విమానంలో వర్షం.. గొడుగులు తెరిచిన ప్రయాణికులు


EPFO: PFను సులువుగా ఇలా విత్‌డ్రా చేసుకోండి