Minister Ktr: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఎలెస్ట్ కంపెనీ ముందుకు వచ్చింది. దేశ చరిత్రలో తొలిసారిగా డిస్‌ప్లే ఫ్యాబ్ రంగంలో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణలో రూ.24 వేల కోట్ల డిస్‌ ప్లే ఫ్యాబ్ కోసం పెట్టుబడి పెట్టనున్నారు. ఈమేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలెస్ట్ కంపెనీ తన పెట్టుబడితో తెలంగాణలో డిస్‌ ప్లే ఫ్యాబ్‌ను ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. దీని వల్ల స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, లాప్‌ట్యాప్‌లు వంటి డిస్‌ప్లేలను తయారు చేస్తారు. ప్రపంచ ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో ఒకటైన రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ద్వారా ఎలెస్ట్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఈ కంపెనీని ఆమొలెడ్‌ డిస్‌ప్లే, లిథియం ఆయాన్ సెల్స్, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ఏర్పాటు చేశారు.


ఎలెస్ట్ కంపెనీతో ఒప్పందం కుదరడంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ పెట్టుబడి రావడం రాష్ట్రానికే కాదు..దేశానికే గర్వకారణమని చెప్పారు. సెమీకండక్టర్ మిషన్‌ ప్రకటన తర్వాత రాష్ట్రంలోకి ఫ్యాబ్ రంగంలో పెట్టుబడులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి. తెలంగాణలో పెట్టుబడి ద్వారా డిస్‌ ప్లే ఫ్యాబ్‌తో ప్రపంచంలోనే అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని రాజ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఛైర్మన్ రాజేష్‌ మెహతా ప్రకటించారు. దీని వల్ల 3 వేల మందికి ఉపాధి కల్గుతుందన్నారు.


Also read: Pawan on Major Movie: దూసుకెళ్తున్న మేజర్ మూవీ..చిత్ర బృందానికి పవన్ అభినందనలు..!


Also read:Prashant Kishor Meet to Kcr: త్వరలో జాతీయ పార్టీ ఏర్పాటు..కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ మంతనాలు..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి