గ్రేటర్ ఎన్నికల వేళ కొత్త వివాదం రేగుతోంది. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై దుమారం ప్రారంభమైంది. ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


జీహెచ్ఎంసీ ఎన్నికల ( Ghmc Elections ) ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే..పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ ( Surgical Strikes in Old City ) నిర్వహిస్తామంటూ దుమారం రేపారు.  పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీయులు ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. ఉప్పల్, రామంతపూర్‌లలో బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ ( Bandi Sanjay ) చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. టీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై ప్రజల్ని మోసం చేస్తున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. 


బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ ఏంటి ?   కొన్ని సీట్లు, ఓట్ల కోసం ఇంతగా దిగజారుతారా ? తోటి ఎంపీ వ్యాఖ్యల్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమర్ధిస్తారా అంటూ కేటీఆర్ మండిపడ్డారు.  బండి సంజయ్‌ వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు ఖండించలేదని కేటీఆర్‌ నిలదీశారు. పచ్చని హైదరాబాద్‌లో చిచ్చుపెడతారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ ప్రజలను విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు.



Also read: GHMC Elections: పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్..నిజమేనా