GHMC Imposes Fine For TRS and BJP: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ హైదరాబాద్‌లో ఫ్లెక్సీ వార్ రాజుకున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్-బీజేపీ పోటాపోటీ ఫ్లెక్సీలు,హోర్డింగులతో నగరమంతా గులాబీమయంగా, కాషామయంగా కనిపిస్తోంది. ప్రధాని మోదీ సహా సమావేశాలకు వచ్చే ముఖ్య నేతలకు స్వాగతం పలుకుతూ బీజేపీ నేతలు ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అదే సమయంలో సాలు దొర సెలవు దొర అంటూ ఫ్లెక్సీలతో కేసీఆర్‌ను టార్గెట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీకి కౌంటర్‌గా టీఆర్ఎస్ కూడా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేసింది. మెట్రో పిల్లర్లు, బస్టాప్స్‌ను ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌తో నింపేసింది. తెలంగాణలో కేసీఆర్ పాలనలో సాధించిన ప్రగతిని చెప్పేలా.. అదే సమయంలో మోదీ పాలనా తీరును ఎండగట్టేలా సాలు మోదీ సంపకు మోదీ.. బైబై మోదీ స్లోగన్స్‌తో వాటిని ఏర్పాటు చేసింది. కొన్నిచోట్ల టీఆర్ఎస్ హోర్డింగులపై బీజేపీ కార్యకర్తలు మోదీ ఫోటోతో ఉన్న బ్యానర్లు అతికించారు. దీనిపై గులాబీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఓవైపు టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఇలా ఫ్లెక్సీ వార్ జరుగుతుండగా.. మరోవైపు జీహెచ్ఎంసీ తన పని తాను చేసుకుపోతోంది. నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌పై జరిమానా విధిస్తోంది. ఇప్పటివరకూ బీజేపీకి రూ.20 లక్షలు, టీఆర్ఎస్‌కు రూ.3 లక్షలు జరిమానా విధించింది. జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.



Also Read: Dakshin Superfast Train: దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ రైల్లో మంటలు... వెంటనే నిలిపివేయడంతో తప్పిన ప్రమాదం


Also Read: Bhagyalaxmi Temple: చార్మీనార్ భాగ్యలక్ష్మి ఆమ్మవారికి యూపీ సీఎం యోగీ పూజలు.. పాతబస్తీలో హైఅలర్ట్


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook