Note for Vote case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణకు హాజరు కాని నిందితుడు ఉదయ్ సింహకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన ఓటుకు నోటు కేసు ( Note for vote case ) విచారణ ప్రారంభమైంది. ఏసీబీ కోర్టులో నిందితులపై నమోదైన అభియోగాలపై విచారణ మొదలైంది. నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటీషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు..మరో నిందితుడు, విచారణకు హాజరుకాని ఉదయ సింహకు ( uday simha ) కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ( non bailable warrant ) జారీ చేసింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై అభియోగాలపై ఛార్జెస్ ఫ్రేమ్ అయ్యాయి. అతనిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12, ఐపీసీ 120 బి రెడ్ విత్ 34 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. ఇదే కేసులో ఇతర నిందితులైన రేవంత్ రెడ్డి ( Revanth reddy ), సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ లు కోర్టు విచారణకు హాజరయ్యారు. గైర్హాజరైన ఉదయ్ సిన్హాకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఏసీబీ కోర్టు. 


నిందితులంతా ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాలని గతంలోనే ఏసీబీ కోర్టు ( Acb court ) ఆదేశించింది. మరోవైపు నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటీషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆడియో , వీడియో టేపులకు సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకంగా మారింది. తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 22వ తేదీకు వాయిదా వేసింది. చాలాకాలం విరామం తరువాత విచారణ ప్రారంభం కావడంతో..కీలక సూత్రధారులకు ఇప్పుడు కలవరం ప్రారంభమైంది. Also read: AP: తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు..ఎవరంటే..