తెలంగాణ ( Telangana ) ప్రభుత్వం రెవెన్యూ శాఖను పూర్తిగా క్రమబద్ధీకరించి, ప్రజలకు వెసులుబాటు, మరింత సరళమైన విధానంతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) నేడు తెలంగాణ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కొన్ని దశాబ్దాల నుంచి ప్రజలు అనుభవిస్తున్న బాధలకు ఈ కొత్త రెవెన్యూ చట్టం చరమగీతం పాడుతుంది అన్నారు. రైతులకు మేలు జరుగుతుంది అని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



కొత్త రెవెన్యూ చట్టం.. హైలైట్స్


- కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ఇకపై ధరణి వెబ్ సైట్ లో అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి. పారదర్శకత ప్రధానంగా ఉంటుంది.


- ధరణి వెబ్ సైట్ ను ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఓపెన్ చేసుకోవచ్చు.


- ఈ వెబ్ సైట్ లో రెండు క్యాటగెరిస్ ఉంటాయి ఒకటి వ్యవసాయ, రెండోది వ్యవసాయేతర భూమి వివరాలు ఉంటాయి.


- కొత్త రెవెన్యూ చట్టంలో ఏ అధికారికి ప్రత్యేకంగా విచక్షణా అధికారాలు ఉండవు.


- ఈ చట్టం రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యూటేషన్ కు వెసులుబాటు కల్పిస్తుంది.




- ఇలా మ్యూటేషన్ చేసే అధికారం ఆర్టీవో నుంచి ఎమ్మార్వోకు అప్పగించనున్నారు.


- ఈ కొత్త రెవెన్యూ చట్టం వల్ల ఆస్తి తగాదాలు ఉండవు.


- మ్యూటేషన్ వివరాలు వెంటనే ధరణి వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాలి.


- రిజిస్ట్రేషన్ అయిన వెంటనే డాక్యుమెంట్, పాస్ బుక్ తో పాటు ధరణి కాపీ తీసుకోవచ్చు.


- తెలంగాణలో ప్రస్తుతం 2 కోట్ల 75 లక్షల ఎకరాల భూభాగం ఉంది.


- వారసత్వంగా వచ్చే భూమిని విభజించాలి అనుకుంటే ఉమ్మడి ఒప్పందం కావాల్సిందే.


- ఒక వేళ పాస్ బుక్ లేకుంటే.. వాటిని తహసీల్దార్ వెంటనే జారీ చేయాల్సి ఉంటుంది.


- అగ్రికల్చర్ భూమికి సంబంధించిన కొనుగోలు లావాదేవీలో యాజమాన్య హక్కులు వెంటనే మార్చాలి.




-  కొన్నివారికి వెంటనే హక్కులు బదిలీ చేస్తూ రికార్డు పూర్తి చేయాలి.


- తహసీల్దార్ తప్పు చేస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయి. సదరు భూమి స్వాధీనం చేస్తారు.


- కొత్త రుణాలు మంజూరు చేయడానికి డిజిటల్ రికార్డులను ప్రామాణికంగా తీసుకోనున్నారు.


- ఇకపై రుణాల కోసం పాస్ పుస్తకాలను బ్యాంకులో పెట్టే అవసరం లేదు.


- వీఆర్వోలను వారి గ్రేడ్ ఆధారంగా సమాన స్థాయి ఉద్యోగాలకు బదిలీ చేసి భర్తీ చేస్తారు.


- కొత్త రెవెన్యూ చట్ట వీఆర్వోలు వాలంటరీ రిటైర్మెంట్ లేదా స్వచ్ఛంద పదవి విరమణ చేసే అవకాశం కల్పిస్తోంది.



- ఇకపై అక్రమాలకు పాల్పడితే ఉద్యోగులపై చర్యలు ఉంటాయి. వారిని సర్వీసు నుంచి తొలగిస్తారు.


- జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యు రికార్డుల్లో నమోదు చేయాలి.


- సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు తహసీల్దార్లకు అప్పగించనున్నారు.


- రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వ వెబ్ సైట్ లో స్లాట్ బుకింగ్ చేయాల్సిందే.