CM KCR relief kit: హైద‌రాబాద్: న‌గ‌రంలో భారీ వర్షాలతో వరదలు పోటెత్తిన అనంతరం చేపట్టిన సహాయ కార్యక్రమాలపై నేడు జిహెచ్ఎంసి ( GHMC ) ప్ర‌ధాన కార్యాల‌యంలో నగర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్‌తో రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ( Minister KTR ) ప్ర‌త్యేక స‌మీక్ష నిర్వ‌హించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పరిస్థితులు సాధార‌ణ స్థాయికి తీసుకొచ్చేందుకు చ‌ర్య‌లు చేపట్టినట్టు మంత్రి కె.టి.ఆర్‌ తెలిపారు. వ‌ర‌దలు వచ్చిన అన్ని ప్రాంతాల్లో జీహెచ్ఎంసి సిబ్బంది పర్యటించాలని.. ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌తీ కుటుంబానికి వారి ఇంటి వ‌ద్ద‌కే వెళ్లి సిఎం రిలీఫ్ కిట్‌ను ( CM relief kit ) అంద‌జేయాలని ఆదేశించారు. సిఎం రిలీఫ్ కిట్‌లో రూ. 2,800 విలువైన ఒక నెల‌కు స‌రిప‌డ నిత్యావ‌స‌రాలు, 3 బ్లాంకెట్లు అందిస్తున్న‌ట్లు తెలిపారు. Also read : Telangana Covid-19: కొత్తగా 1,451 కరోనా కేసులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ‌ర‌ద ప్రాంతాల్లో ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని తీసుకువ‌చ్చేలా స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్ ( Sanitation drive ) చేపట్టాల‌ని అధికారులకు సూచించారు. యాంటి లార్వా స్ప్రేయింగ్‌, సోడియం హైపోక్లోరైట్, క్రిమీసంహార‌క ద్రావ‌నాల‌ను  అన్ని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో పిచికారి  చేయించాల‌ని ఆదేశించారు. ఎంట‌మాల‌జి బృందాల ద్వారా కెమిక‌ల్స్ స్ప్రే చేయించాల‌ని సూచించారు. స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్‌, స్ప్రేయింగ్‌కు అవ‌స‌ర‌మైతే అద‌నంగా వాహ‌నాల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని ఆదేశించారు. వ‌ర‌ద ప్రాంతాల్లో నిలిచిన నీళ్ల‌ను తొల‌గించుట‌కు అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు.  


నాలాలు ( Hyderabad nalas ), రోడ్ల‌పై పేరుకుపోయిన చెత్త చెదారం, బుర‌ద‌, భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాలు, శిథిలాల‌ను తొల‌గించుట‌కు అవ‌స‌ర‌మైన సిబ్బందిని, అద‌నపు వాహ‌నాల‌ను సమకూర్చుకునైనా పనులు ఆగకుండా వేగవంతం చేయాలని అన్నారు. అంటు వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా ముందు జాగ్ర‌త్త‌ చర్యలు చేపట్టి స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్‌ నిర్వహించాలని, అలాగే వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో మొబైల్ మెడిక‌ల్ క్యాంపుల‌ను ఏర్పాటు చేయాల‌ని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. Also read : Telangana floods: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్


హైదరాబాద్ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ( Hyderabad floods ) ఉంటున్న ప్ర‌జ‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌పై న‌మ్మ‌కాన్ని క‌లిగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్న మంత్రి కేటీఆర్... మొబైల్ మెడిక‌ల్ క్యాంపుల నిర్వ‌హణ‌లో జిహెచ్ఎంసితో పాటు హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్ జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని వైద్య ఆరోగ్య శాఖ డి.ఎం.ఇ డాక్ట‌ర్ శ్రీ‌నివాస్‌కు సూచించారు. 


భారీ వ‌ర్షాలు ( Heavy rains ), వ‌ర‌ద‌తో దెబ్బ‌తిన్న ఇళ్ల ఎన్యుమ‌రేష‌న్‌ను చేయాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. ఈ స‌మావేశంలో జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌, హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ శ్వేత‌మ‌హంతి, ఇ.వి.డి.ఎం డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి, ఎన్‌.ఎస్‌.సి శ్రీ‌ద‌ర్‌, చీఫ్ ఇంజ‌నీర్‌ జియాఉద్దీన్‌, అద‌న‌పు క‌మిష‌న‌ర్లు రాహుల్ రాజ్‌, సంతోష్‌, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు బి.శ్రీ‌నివాస్‌రెడ్డి, ఎన్‌.ర‌వికిర‌ణ్‌, ఉపేంద‌ర్‌ రెడ్డి, సామ్రాట్ అశోక్, ప్రావిణ్య‌, వి.మ‌మ‌త‌ త‌దిత‌రులు పాల్గొన్నారు. Also read : LRS last date in Telangana: ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు పొడిగింపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe