KT Rama Rao: నన్ను జైలుకు పంపడమే రేవంత్ రెడ్డి లక్ష్యం.. అవినీతి లేదు ఏం లేదు
KTR Clears Here No Corruption In Formula E Car Race: `ఫార్ములా-ఈ కేసులో అవినీతి లేనప్పుడు కేసు ఏమిటి? రేవంత్ రెడ్డి ప్రయత్నమంతా నన్ను జైలుకు పంపించడమే లక్ష్యం` అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మరెన్నడూ లేనట్టు ఈడీ దూకుడుగా వెళ్తోందని తెలిపారు.
Formula E Car Race: ఫార్ములా ఈ కారు రేసులో తాను మొదటి రోజు చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ నిర్ణయంగా ఒక మంత్రిగా నిర్ణయం తీసుకున్న అదే మాటకు నేను కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. అవినీతి జరగనే లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ పేరుతో కేసులు పెడుతోంది అని విస్మయం వ్యక్తం చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
Also Read: Telagnana Assembly: కేటీఆర్ సంచలనం.. తొలిసారి రేవంత్ రెడ్డికి సంపూర్ణ మద్దతు
హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో సోమవారం కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. వాటిలో ప్రధానంగా ఫార్ములా ఈ కారు రేసుపై మాట్లాడారు. 'ప్రభుత్వం తమ అధికార యంత్రాంగం చేతిలో ఉందని అడ్డగోలుగా కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన మాటల్లోనే అవినీతి జరగలేదని చెప్పారు' అని కేటీఆర్ గుర్తుచేశారు. వినీతి ఎక్కడ ఉందని ముఖ్యమంత్రినీ అడిగితే చెప్పలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
'ఫార్ములా ఈ ప్రతినిధులతో కలిసిన ఫొటో బయట పెట్టడంతో రేవంత్ రెడ్డి అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. సస్పెండ్ చేస్తాను. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని బెదిరిస్తున్నాడు' అని కేటీఆర్ కీలక విషయం చెప్పారు. 'ఫార్ములా ఈ వాళ్లతో కలిసిన రేవంత్ రెడ్డి వాళ్లపైన ఎందుకు కేసు పెట్టలేదు. వాళ్లతో జరిగిన సమావేశాన్ని ఒక సంవత్సరం పాటు దాచి ఉంచాడు. వారి దగ్గర డబ్బులు తీసుకున్నాడని అనుమానంగా ఉంది. అనుచిత లబ్ధి పొందింది ఫార్ములా ఈ సంస్ధ వాస్తవమైతే వాళ్లపైనే ఎందుకు కేసు పెట్టలేదు?' అని కేటీఆర్ ప్రశ్నలు కురిపించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై కేటీఆర్ సందేహాలు వ్యక్తం చేశారు. 'రేవంత్ రెడ్డి రూ.600 కోట్లు అంటూ అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అతడితో కాంట్రాక్టర్లకు రద్దు చేసుకోలేమని చెబుతున్న రేవంత్ రెడ్డి ఫార్ములా ఈని ఏ విధంగా రద్దు చేసుకున్నాడు. దీనికి ఏమన్నా మంత్రివర్గ ఆమోదం ఉందా?' అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రొసీజర్ పొరపాట్లు ఉంటే సంబంధిత సంస్థల దగ్గరికి వెళ్లాలి కానీ.. అవినీతి అని కేసులు పెట్టడం వృథా' అని అభిప్రాయపడ్డారు.
'హైదరాబాద్ పేరు ప్రతిష్ట,, తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు హైదరాబాద్ నుంచి ఫార్ములా ఈ రేసు పోవద్దన్న ఉద్దేశంతోనే డబ్బులు కట్టాం. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరిగే అవకాశమే లేదు. కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంలో మరిన్ని విషయాలు చెప్పలేను. ఏసీబీ ఎఫ్ఐఆర్‌ని కొట్టివేయాలని హైకోర్టులో కేసు నమోదు చేశాను. ఈడీ నోటీసులు వచ్చిన మాట వాస్తవమే!. ఇతర కేసుల్లో మాదిరి కాకుండా ఈ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది' అని కేటీఆర్ చిట్‌చాట్‌లో తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.