Telangana: కరోనావైరస్ వ్యాప్తి నివారణకు ముఖ్యమైన సమాచారం
How to fight against COVID-19 | లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటి ( మే 16 నుంచి ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా జనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించడం జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. లాక్‌డౌన్ సడలింపుల ( Lockdown exemptions) అనంతరం కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏవీ జనం పాటించడం లేదని, మాస్కు ధరించడం, సోషల్ డిస్టన్సింగ్ పాటించడం వంటివి చేయకపోగా.. ఒక చోట గుంపుగా ఏర్పడటం లాంటివి చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారని జూన్ 13 నాటి హెల్త్ బులెటిన్‌లో సర్కార్ పేర్కొంది.
How to fight against COVID-19 | లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటి ( మే 16 నుంచి ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా జనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించడం జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. లాక్‌డౌన్ సడలింపుల ( Lockdown exemptions) అనంతరం కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏవీ జనం పాటించడం లేదని, మాస్కు ధరించడం, సోషల్ డిస్టన్సింగ్ పాటించడం వంటివి చేయకపోగా.. ఒక చోట గుంపుగా ఏర్పడటం లాంటివి చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారని జూన్ 13 నాటి హెల్త్ బులెటిన్‌లో సర్కార్ పేర్కొంది. సరైన జాగ్రత్తలు పాటించకుండానే ప్రయాణాలు చేయడం వంటి పనులు చేస్తుండటం వల్ల కరోనావైరస్ ( Coronavirus) వేగంగా వ్యాపిస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆవేదన వ్యక్తంచేసింది.
ఈ వయస్సు వాళ్లకు కరోనా సోకే డేంజర్ ఎక్కువ ( Vulnerable age group) :
10 ఏళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇంటి నుంచి బయటికి రాకుండా జాగ్రత్త పడాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
మాస్కు తప్పనిసరి ( mask usage ):
ఇంట్లోంచి కాలు బయటపెడితే మాస్కు ధరించడం తప్పనిసరి అని వైద్య ఆరోగ్య శాఖ ఈ హెల్త్ బులిటెన్‌లో మరోసారి స్పష్టంచేసింది. ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రభుత్వంలోని పెద్దలు, ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే.
ఫిజికల్ డిస్టన్సింగ్ ( Physical distancing / Social distancing ):
కరోనా వైరస్ని నివారించాలంటే ప్రతీ ఒక్కరూ సాధ్యమైనంత వరకు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాల్సిందేనని సర్కార్ సూచించింది.
ప్రయాణాలు ( Travel):
జనం అనవసర ప్రయాణాలు రద్దు చేసుకోవాలని.. ఎంతో అవసరమైతేనే తప్ప ప్రయాణాలు చేయకూడదని సర్కారు విజ్ఞప్తి చేసింది. ప్రయాణాలు చేయాల్సి వస్తే కూడా కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
వీళ్లు బయటికి రాకపోవడమే మంచిది ( Morbidities):
హైబీపీ, మధుమేహం ( Diabetes), గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులుతో పాటు ఇతర తీవ్రమైన జబ్బులు ఉన్న వారు ఇంట్లోంచి బయటికి రాకుండా జాగ్రత్త పడాల్సిందిగా సర్కారు విజ్ఞప్తి చేసింది. ఏవైనా జబ్బులు ఉన్న వారికి కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉండటంతో పాటు ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారిలోనూ ముందు నుంచీ ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం.
విటమిన్ సి ( Vitamin C food ) :
కరోనావైరస్ నివారణకు విటమిన్ సి ( Vitamin C) అధికంగా ఉండే ఆహారం తీసుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఉంటేనే వైరస్‌తో పోరాడటానికి సాధ్యమవుతుంది. మరి వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే శరీరానికి విటమిన్-సి ఎంతైనా అవసరమేననేది అందరూ గుర్తించాల్సిన విషయం. Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందనే విషయానికొస్తే ( Total COVID-19 cases in Telangana)... జూన్ 13న చివరి 24 గంటల వ్యవధిలో ఏకంగా 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యధికం. ఇందులోనూ ఎప్పటిలాగే గ్రేటర్ హైదరాబాద్ వాటానే అధికంగా ఉంది. అవును.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 179 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మిగతా వాటిలో సంగారెడ్డి జిల్లాలో 24, మేడ్చల్ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 11, మహబూబ్ నగర్ జిల్లాలో 4, వరంగల్ రూరల్, అర్బన్, కరీంనగర్, నల్లగొండ, ములుగు, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో రెండేసి, సిద్దిపేట, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున కరోనా పాజిటివ్ కేసులను గుర్తించారు. దీంతో కొత్తగా గుర్తించిన వారితో కలిపి రాష్ట్రంలో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య మొత్తం 4,737 కు చేరుకుంది. వీళ్లలో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి తిరిగి స్వస్థలాలకు వచ్చిన వారు 449 మంది ఉన్నారు. మిగతా 4,288 మంది స్థానికులేనని తెలంగాణ సర్కారు తెలిపింది.
కరోనావైరస్ కారణంగా శనివారం మరో 8 మంది మృతి చెందారు ( COVID-19 death toll). దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 182కి చేరుకుంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 2,352 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతానికి మరో 2,203 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీళ్లలో కొంతమంది ఆస్పత్రులలో చికిత్స పొందుతుండగా.. ఇంకొంతమంది కరోనావైరస్ లక్షణాలు లేకపోవడంతో హోమ్ క్వారంటైన్ ( Home quarantine) అవుతున్నారు.