Saidabad girl's rape and murder case accused Raju's suicide case: హైదరాబాద్: సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిని చంపేసిన పల్లకొండ రాజు వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో రైలు పట్టాలపై శవమై కనిపించిన సంగతి తెలిసిందే. అయితే, రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నప్పటికీ.. రాజుది ఆత్మహత్య కాదు, అతడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టుకు (TS High court) ఫిర్యాదు చేశారు. రాజును చంపేసి, అతడిది ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని పౌరహక్కుల సంఘం నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పౌరహక్కుల సంఘం దాఖలు చేసిన పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. పల్లకొండ రాజు మృతిపై (Raju's suicide case) జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తున్నట్టు స్పష్టంచేసింది. వరంగల్ మూడో మెట్రోపాలిటన్ కోర్టు జడ్జికి జ్యుడిషియల్ విచారణ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. పోస్టుమార్టం వీడియోలను వరంగల్ మూడో మెట్రోపాలిటన్ కోర్టు జడ్జికి శనివారం రాత్రి 8 గంటల్లోగా అందించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రాజు మృతిపై (Raju's death case) సమగ్ర నివేదిక రూపొందించి 4 వారాల్లోగా హై కోర్టుకు అందించాలని సదరు జడ్జికి సూచించింది.


Also read : Saidabad rape case accused Raju suicide case: ఎన్‌కౌంటర్ చేస్తామన్న 1 రోజు తరువాత నిందితుడి మృతదేహం.. రేకెత్తిస్తున్న పలు అనుమానాలు!


రాజు ఆత్మహత్య కేసుపై సోషల్ మీడియాలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారి చావుకు కారణమైన రాజుకు తగిన శాస్తి జరిగిందని పలువురు అభిప్రాయపడితే.. ఇంకొంత మంది రాజు మృతిపై తమకు తోచిన శాస్త్రీయకోణాలతో సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనపై హై కోర్టు (Telangana High court) ఏం తేల్చనుందో వేచిచూడాల్సిందే మరి.


Also read : Saidabad rape case accused Raju suicide case: మానవ మృగం ఎలా చనిపోయిందంటే..?? ప్రత్యక్ష సాక్షి వివరణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook