భారతీయ జనతా పార్టీ (BJP)కి సీనియర్ నేత, తెలంగాణ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి రాజీనామా చేశారు. దుబ్బాకలో ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి పార్టీ అధికార ప్రతినిధి శ్రీధర్‌ రెడ్డి తన రాజీనామాతో షాకిచ్చారు. బీజేపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన రావుల శ్రీధర్‌రెడ్డి ఆదివారం ఉదయం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి పంపించినట్లు సమాచారం. తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి అధికార టీఆర్ఎస్ (TRS) పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    Dubbaka Bypoll: ప్రజలకు తెలియాలంటూ.. కేటీఆర్ ఆసక్తికర ట్విట్



శ్రీధర్‌రెడ్డి 2018లో జూబ్లీహిల్స్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీని వీడటం బీజేపీకి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ సాధన ఉద్యమంలో 11 ఏళ్ల కిందట ఆయన బీజేపీలో చేరారు. అయితే టీఆర్ఎస్ పార్టీ దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలుపుతుంటే... బీజేపీ రైతు వ్యతిరేక బిల్లులను తీసుకొచ్చి ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. 



 


బీజేపీ అంతా కార్పొరేట్ మయం చేస్తోందని, ఈ ఆత్మవంచన రాజకీయాలు నచ్చకనే పార్టీని వీడుతున్నట్లు తెలపారు. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు తీసుకురావడంతో పాటు పచ్చి అబద్దాలు చెబుతోందన్నారు. రైతులకు, అన్ని వర్గాలకు మేలు జరగాలంటే టీఆర్ఎస్ సరైన మార్గంలా కనిపించిందన్నారు. బీజేపీ వైఖరితో తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని రావుల శ్రీధర్‌రె డ్డి అభిప్రాయపడ్డారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe