GHMC Elections: రిటర్నింగ్ అధికారుల నియామకం

GHMC Elections 2020 | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల నోడల్ అధికారులను జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ, కమీషనర్ డీఎస్ లోకేష్ కుమార్ ఇటీవల నియమించారు.

Last Updated : Oct 29, 2020, 08:19 AM IST
  • జీహెచ్ఎంసీ ఎన్నికలపై తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
  • రిటర్నింగ్ అధికారులు, సహాయక అధికారుల నియమాకం
  • వర్షాలు, వరదల తర్వాత జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు
GHMC Elections: రిటర్నింగ్ అధికారుల నియామకం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC Elections 2020) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ (Telangana) ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ నుంచే జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికలకు కసరత్తు మొదలైంది. ఎన్నికల నోడల్ అధికారులను జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ, కమీషనర్ డీఎస్ లోకేష్ కుమార్ ఇటీవల నియమించారు. తాజాగా రిటర్నింగ్, సహాయక రిటర్నింగ్ అధికారులను నియమించింది. అసలే భారీ వర్షాలు, వరదల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికార టీఆర్ఎస్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

 

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్యాలెట్‌ పేపర్‌ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు (GHMC Elections 2020) నిర్వహించనున్నారని తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలిపారు. కాగా, జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. త్వరలో ఎన్నికలు జరగనుండగా.. ఇందులో భాగంగా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. రిజర్వ్‌లో మరో 61 మంది రిటర్నింగ్ అధికారులు, 71 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News