River water disputes between AP and Telangana | హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ ( Pothireddypadu reservoir ) సహా ఇతర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఇకనైనా ఆపాలని.. లేదంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ - పెద్ద మరూర్ వద్ద బాబ్లీ ప్రాజెక్ట్ ( Babli Project ) తరహాలో బ్యారేజీ నిర్మించి తీరుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నీటి వాటాల విషయంలో గతంలో తెలంగాణకు అన్యాయం జరిగినందునే తెలంగాణ ఉద్యమం పుట్టింది, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేసిన కేసీఆర్.. ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రం తరహాలో ఏపీ తన పద్ధతిని మార్చుకోకపోతే దాని పర్యావసనాలు వేరే విధంగా ఉంటాయని హెచ్చరించారు. మంగళవారం కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ( Apex council meeting ) పాల్గొన్న సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలుచేశారు. Also read : TSPSC: గ్రూప్ 4 ఫలితాలు విడుదల


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా నదీ జలాల విషయంలో ప్రస్తుత ఏపీ సర్కార్ ( AP Govt ) కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రం అవలంభించిన విధానాలనే అనుసరిస్తోందని మండిపడిన సీఎం కేసీఆర్ ( CM KCR ).. అలంపూర్ - పెద్ద మరూర్ వద్ద తెలంగాణ సర్కార్ బ్యారేజీ నిర్మించడం జరిగిందంటే, అందులోంచి రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని హెచ్చరించారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తే కుదరదని తేల్చిచెప్పిన కేసీఆర్.. అంతర్రాష్ట్ర నదీజలాల్లో న్యాయంగా రాష్ట్రానికి లభించే వాటాను పొందే హక్కు తెలంగాణకు ఉందని అన్నారు. Also read : Bihar Assembly election 2020: జేడీయూ, బీజేపీ మధ్య కుదిరిన ఒప్పందం


శ్రీశైలానికి ( Srisailam project ) గండిపెట్టేలా నిర్మితమవుతున్న పోతిరెడ్డిపాడు కెనాల్‌ను తెలంగాణ ప్రజానికం తెలంగాణ ఉద్యమకాలం నుంచే వ్యతిరేకిస్తోందని.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా పోతిరెడ్డిపాడును ఆపకపోగా దానిని మరింత విస్తరించారని సీఎం కేసీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. నదీజలాల పంపిణి విషయంలో ( River water sharing row ) తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రం తక్షణమే అడ్డుకోవాలవి సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్‌కి విజ్ఞప్తిచేశారు. తెలంగాణలో కొత్తగా ఏ ప్రాజెక్టులూ చేపట్టలేదని, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు ఏవైనా వాటి నిర్మాణం ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలయ్యాయని సీఎం కేసీఆర్ కేంద్రమంత్రి షెకావత్‌ దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణకు కేటాయించిన 967.94 టీఎంసీల ఆధారంగానే గోదావరి నదీమీద ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రికి వివరించారు. Also read : TS EAMCET 2020 Results: తెలంగాణ ఎంసెట్‌ టాపర్లు వీరే..