Revanth Reddy Swearing Ceremony: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్డేడియంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎల్డీ స్డేడియంలో రూట్‌మ్యాప్, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. స్డేడియంలో ఎవరు ఎటు నుంచి లోపలకు వెళ్లాలి, నగరంలో ట్రాఫిక్ ఎటు మళ్లించారనే వివరాలు ఇప్పటికే పోలీసులు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి తరలిరానున్నారు. ఈ సందర్భంగా స్డేడియం చుట్టుపక్కల 3 వేలమందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. స్డేడియం లోపల, బయట డాగ్ స్క్వాడ్ తనిఖీలు పూర్తి చేశారు. 


స్డేడియంలో రూట్‌మ్యాప్


ఎల్బీ స్డేడియం గేట్ నెంబర్ 8 నుంచి రేవంత్ రెడ్డికి ఎంట్రీ ఉంటుంది. ఇక గేట్ నెంబర్ 10 నుంచి సీఎం కాన్వాయ్ ప్రవేశిస్తుంది. గేట్ నెంబర్ 15, 17 నుంచి వీవీఐపీలు ప్రవేశిస్తారు. గేట్ నెంబర్ 6,7,12,14 నుంచి సాధారణ ప్రజలకు ప్రవేశముంటుంది. నిజాం కళాశాళ గ్రౌండ్ నుంచి బషీర్ బాగ్ చౌరస్తా వరకూ వాహనాలకు పార్కింగ్ సదుపాయం కలగజేశారు. ఎల్బీ స్డేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపధ్యంలో హైదరాబాద్ నగరంలో మద్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ వివిధ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు, నిషేధం అమల్లో ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దీనికి సంబంధించిన ట్రాఫిక్ రూట్‌మ్యాప్ విడుదల చేశారు. 


ఇవాళ మద్యాహ్నం 1.04 గంటలకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు మరో ఐదారుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల ఫైలుపై తొలి సంతకం చేయవచ్చు. మద్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రిగా సచివాలయంలో ప్రవేశిస్తారు. 


జూబిలీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసం నుంచి ఎల్బీ స్డేడియం వరకూ రూట్‌మ్యాప్‌లో అడుగడుగునా తనిఖీ ఉంటుంది.స్డేడియం చుట్టూ నిత్యం పెట్రోలింగ్ జరుగుతుంటుంది. బందోబస్తు, భద్రత కోసం సీఎం సెక్యూరిటీతో పాటు ఆక్టోపస్, శాంతి భద్రతలు, టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్, సాయుధ బలగాల సేవలు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నిఘా, మప్టీ పోలీసులు పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు. 


Also read: Ap Elections Survey: ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఏపీలో అధికారం ఎవరిది, హల్‌చల్ చేస్తున్న పోల్ స్కాన్ సర్వే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook