Muthireddy Yadagiri Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. తెలంగాణలో తొలిసారి ఎమ్మెల్యేకు కరోనా
TRS MLA Muthireddy Yadagiri Reddy | హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనావైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. జనగామ నియోజకవర్గం (Jangaon MLA) నుంచి తెలంగాణ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అవడం టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కలకలం రేపింది.
TRS MLA Muthireddy Yadagiri Reddy | హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనావైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. జనగామ నియోజకవర్గం (Jangaon MLA) నుంచి తెలంగాణ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అవడం టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. తెలంగాణలో ఎమ్మెల్యేల్లో ఇదే తొలి కరోనా పాజిటివ్ కేసు. ఇదివరకు బీజేపి నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి (Chintala Ramachandra Reddy) వంటి వారికి కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వారిలో మాత్రం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిదే కరోనావైరస్ బారిన పడిన మొట్టమొదటి ఎమ్మెల్యే కేసుగా పరిగణించాల్సి ఉంటుంది. ( కరోనా దరిచేరకుండా ఉండాలంటే.. Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )
బీజేపి నేత చింతల రామచంద్రా రెడ్డికి కరోనావైరస్ పాజిటివ్‌గా తేలిన అనంతరం ఆయన కుటుంబసభ్యులకు కూడా కోవిడ్-19 పరీక్షలు (COVID-19 tests) జరపగా.. వాళ్లకు కూడా కరోనావైరస్ సోకినట్టు గుర్తించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత చింతల రామచంద్రా రెడ్డి కుటుంబం తగిన జాగ్రత్తలు పాటిస్తూ క్వారంటైన్ కావడంతో కరోనావైరస్ నుంచి బయటపడింది.
వేగంగా వ్యాపిస్తున్న కరోనావైరస్ ప్రతీ ఒక్కరిని హడలెత్తిస్తోంది. ముఖ్యంగా ప్రజలకు దగ్గరిగా ఉంటూ ప్రజలకు సంబంధించిన పనులు చేసుకునే వారిని కరోనా ఫీయర్ ఇంకా ఎక్కువ వేధిస్తోంది. అందులో ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, ప్రభుత్వ ఉద్యోగులు ముందు వరుసలో ఉన్నారు. ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఈ మూడు వర్గాల వాళ్లు ప్రతీ రోజూ ప్రజల మధ్యే తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని.. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తూ ముందుకు సాగిపోయే వృత్తిలో ఉన్న వాళ్లు కావడంతో.. కరోనవైరస్ బారినపడే అవకాశాలూ అంతే అధికంగా ఉన్నాయనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ( Bonalu festival: బోనాల పండగపై ప్రభుత్వం ప్రకటన )
ఇటీవల గాంధీ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ మనోజ్ కుమార్ అనే జర్నలిస్ట్ మృతి చెందిన తీరు అందరినీ కలచివేసింది. ఆ తర్వాత కూడా పలువురు పాత్రికేయులకు కరోనా సోకడంతో ప్రస్తుతం వాళ్లు క్వారంటైన్‌లో ఉన్నారు. ఢిల్లీలో ఉన్న తెలుగు మీడియా పాత్రికేయులలోనూ కొందరికి కరోనావైరస్ సోకింది. వీరిలో ఒకరు కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం కరోనా నుంచి కోలుకున్నారు. కొంతమంది క్వారంటైన్ పూర్తి చేసుకుని కరోనా నుంచి బయటపడ్డారు. మరికొంత మంది ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.
ఇక ప్రజాప్రతినిధుల విషయానికొస్తే.. ఇదివరకు కూడా పలువురు నేతలు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే, అదృష్టవశాత్తుగా వారికి నెగటివ్ అనే తేలినప్పటికీ... నిత్యం ప్రజల మధ్యే వారికి అందుబాటులో ఉంటూ సేవ చేసే క్రమంలో కరోనా సోకే ప్రమాదం లేకపోలేదనే భయం మాత్రం చాలామంది నేతలను వెంటాడుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..