Gandhi hospital: గాంధీ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే మనోజ్ మృతి : మనోజ్ సోదరుడు సాయినాథ్

Journalist Manoj died of COVID-19 | హైదరాబాద్, జూన్ 10 : కరోనావైరస్‌తో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో కన్నుమూసిన హైదరాబాద్ జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతికి గాంధీ ఆస్పత్రి నిర్లక్ష్య వైఖరే కారణం అని ఆరోపించారు ఆయన సోదరుడు సాయినాథ్. గాంధీ ఆస్పత్రిలో ఉన్న లోపాలపై సాయినాథ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆసుపత్రిలో చేరిన కరోనావైరస్ పేషెంట్స్‌ను ఆస్పత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారని.. అందువల్లే తన సోదరుడు మనోజ్ కుమార్ మృతి చెందారని సాయినాథ్ ఆరోపించారు.

Last Updated : Jun 10, 2020, 10:57 AM IST
Gandhi hospital: గాంధీ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే మనోజ్ మృతి : మనోజ్ సోదరుడు సాయినాథ్

Journalist Manoj died of COVID-19 | హైదరాబాద్, జూన్ 10 : కరోనావైరస్‌తో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో కన్నుమూసిన హైదరాబాద్ జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతికి గాంధీ ఆస్పత్రి నిర్లక్ష్య వైఖరే కారణం అని ఆరోపించారు ఆయన సోదరుడు సాయినాథ్. గాంధీ ఆస్పత్రి నిర్వహణలో ఉన్న లోపాలపై సాయినాథ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆసుపత్రిలో చేరిన కరోనావైరస్ పేషెంట్స్‌ను ఆస్పత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారని.. అందువల్లే తన సోదరుడు మనోజ్ కుమార్ మృతి చెందారని సాయినాథ్ ఆరోపించారు. Telangana: కరోనావైరస్ లేటెస్ట్ అప్‌డేట్స్ )

జూన్ 3న మధ్యాహ్నం నేను, నా సోదరుడు మనోజ్ ఇద్దరం నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్‌కి వెళ్లి కరోనావైరస్ పరీక్షలు ( COVID-19 tests) చేయించుకున్నాం. ఆ తర్వాత రాత్రి వేళ ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. నాకు, నా సోదరుడు మనోజ్ ఇద్దరికీ కరోనావైరస్ పాజిటివ్ వచ్చిందని చెప్పిన ఆస్పత్రి వాళ్లు.. తమను వెంటనే వచ్చి ఆస్పత్రిలో చేరాల్సిందిగా సూచించారు.

కరోనావైరస్ చికిత్స కోసం వెంటనే అదే రోజు రాత్రి మేమిద్దరం ఫీవర్ ఆస్పత్రికి ( Nallakunta fever hospital) వెళ్లాం. అక్కడి నుంచి వాళ్లే మమ్ములను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత మాకు వైద్యం చేయడం కోసం ఎవ్వరూ ముందుకు రాలేదు. రాత్రి 1.30 గంటల ప్రాంతంలో నా సోదరుడు మనోజ్‌కి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. తనకు శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉందని.. ఆ విషయం డాక్టర్లకు తెలియజేయమని మనోజ్ చెప్పడంతో వెంటనే నేను డాక్టర్లను వెతుక్కుంటూ వెళ్లి తిరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రతీ రోజు డాక్టర్లు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు అందుబాటులో ఉంటారని.. ఆ సమయంలోనే డాక్టర్లు మనోజ్‌ని పరీక్షిస్తారని అక్కడున్న సిబ్బంది చెప్పారు. Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )

ఇదిలావుండగానే నా సోదరుడు మనోజ్ పరిస్థితి మరింత విషమించింది. దీంతో తన జర్నలిస్ట్ మిత్రులకు, వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిబ్బందికి చెప్పి తనకు వెంటనే వైద్య సహాయం అందేలా ఆస్పత్రి సిబ్బందికి ఫోన్ చేయించాల్సిందిగా కోరాడు. ఆ తర్వాతే ఓ డాక్టర్ వచ్చి వెంటనే ఐసియూకి తరలిస్తామని అన్నారు. కానీ ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా మళ్లీ మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఐసీయూలో బెడ్స్ ఖాళీగా లేవని చెప్పి గంటసేపు వీల్ చైర్ మీదే కూర్చోబెట్టారు. COVID-19 tests: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ )

అలా తన సోదరుడు మనోజ్ కుమార్‌ని గాంధీ ఆస్పత్రి డాక్టర్లు నిర్లక్ష్యం చేశారని... గాంధీలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన సోదరుడు చనిపోయాడని.. డాక్టర్లు సరైన సమయంలో స్పందించి ఉండుంటే తన సోదరుడు బతికి ఉండే వాడని సాయినాథ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News